తమిళనాడులోని డీఎంకే నేతృత్వంలోని విపక్షాలు.. రైతులకు మద్దతుగా ఒకరోజు పాటు నిరాహార దీక్ష చేపట్టాయి. కేంద్రం అమలు చేసిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు చేపడుతోన్న నేపథ్యంలో డీఎంకే ఈ దీక్షకు పిలుపునిచ్చింది.

" వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దీక్ష చేపట్టేవారు జాతీయ వ్యతిరేకవాదులని కేంద్రం చెబుతోంది. దీన్ని మేం ఖండిస్తున్నాం. మేం రైతులకు మద్దతుగానే నిలుస్తాం".
-ఎమ్ కే స్టాలిన్, డీఎంకే అధ్యక్షుడు.
స్టాలిన్
పంజాబ్, హరియాణా రైతులు మూడు వారాలుగా దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎమ్ కే స్టాలిన్, మంత్రి కనిమోజీ, ఇతర పార్టీ సభ్యులు తమిళనాడులో దీక్షకు కూర్చున్నారు.


ఇదీ చదవండి:భారత్లో కోటికి చేరువలో కరోనా కేసులు