ETV Bharat / bharat

తమిళనాట కొలిక్కిరాని సీట్ల పంపకం - aiadmk seat sharing 2021

తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసి పోటీ చేయాలన్న దానిపై ఆయా పార్టీలు స్పష్టతతో ఉన్నాయి. కానీ వాటి మధ్య సీట్ల సర్దుబాటుపై నేతలు పలు ధపాలుగా చర్చలు జరిపినప్పటికీ కొలిక్కి కాలేదు. అమిత్​ షా పర్యటనకు ముందే అన్నాడీఎంకే స్పష్టత ఇస్తుంది అని రాష్ట్ర భాజపా నేతలు భావిస్తుంటే.. కాంగ్రెస్​ కూటమికి మరో రెండు రోజుల సమయం పడుతుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

DMK and AIADMK plays hard in the bargains with their partner; Seat sharing talks in stalemate
తమిళనాట కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు
author img

By

Published : Mar 3, 2021, 5:41 AM IST

తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ఆయా పార్టీల భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపిణీ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేలు రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్​, భాజపాతో కలిసి పోటీ చేయనున్నాయి. మంగళవారం సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయి. కానీ స్పష్టత రాలేదు. మార్చి 7న భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పాల్గొననున్నారు. ఈ పర్యటనకు ముందే అన్నాడీఎంకేతో సీట్ల పంపకం తేలాల్సి ఉండగా మరింత ఆలస్యం అయినట్లు రాష్ట్ర భాజపా సీనియర్ నాయకులు తెలిపారు.

ఇప్పటికే సీట్ల పంపకంలో భాగంగా మిత్రపక్షమైన పీఎంకే(పట్టాలి మక్కల్​ కట్చి పార్టీ)కి 23 సీట్లు కేటాయించినట్లు అధికార అన్నాడీఎంకే భాజపాకు తెలిపింది. విజయ్​కాంత్​ నేతృత్వంలోని డీఎండీకేతో చర్చలు కొనసాగుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీనియర్ నాయకులైన ఆర్​.వైతిలింగం, కేపీ మునుస్వామి డీఎండీకే నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు డీఎంకే కూడా కాంగ్రెస్​తో మరోసారి చర్చలు జరపనున్నట్లు తెలిపింది. అయితే హస్తం పార్టీ ఎన్ని సీట్లను కోరుకుంటుంది అనే దానిపై నేతలు ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. కానీ మరో రెండు రోజుల్లో ఖరారు కానున్నట్లు పేర్కొన్నారు. డీఎంకేకు మిత్ర పక్షమైన సీపీఎం, సీపీఐ పార్టీలకు కేటాయించే సీట్లపై కూడా స్పష్టత రాలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఏప్రిల్​ 6 ఒకే దశలో తమిళనాట 234 సీట్లుకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: కీలక నేతల అధ్యక్షతన కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.