ETV Bharat / bharat

ప్రైవేటు టీచర్​ పెద్ద మనసుకు కలెక్టర్​ ఫిదా - కరోనా నిధికి నగలు విరాళం ఇచ్చిన వితంతువు

వితంతువు గొప్ప మనసుకు ఫిదా అయిపోయారు ఓ జిల్లా కలెక్టర్​. భర్తను పోగొట్టుకుని, అతి కష్టం మీద జీవితాన్ని నెట్టుకొస్తొన్న ఆమె.. జిల్లా కరోనా ఉపశమన నిధికి ఆభరణాలు విరాళంగా ఇవ్వడాన్ని అభినందించారు. అయితే వాటిని తిరిగి ఆమెకే ఇచ్చేసి.. ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు​ కలెక్టర్​.

District collector awards government job for a widow
ప్రైవేటు టీచర్​ పెద్దమనసుకు కలెక్టర్​ ఫిదా
author img

By

Published : Jul 21, 2021, 6:15 PM IST

ప్రైవేటు టీచర్​ పెద్దమనసుకు కలెక్టర్​ ఫిదా

కవిత... తమిళనాడు విరుధునగర జిల్లా రాజపాలయంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉప్యాధ్యాయురాలు. భర్త, కుమారుడితో ఎంతో సరదాగా సాగే ఈమె జీవితాన్ని.. రెండేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదం విషాదంలోకి నెట్టేసింది. నాటి దుర్ఘటనలో భర్తను పోగొట్టుకుంది కవిత. భర్త లేడన్న విషాదాన్ని దిగమింగుకునే.. తనకు వచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అన్ని కష్టాలు పడుతూ కూడా మానవత్వంతో కరోనా రోగులకు సాయం చేయడానికి ముందుకొచ్చింది.

District collector awards government job for a widow
కలెక్టర్​కు నగలు అందజేస్తున్న కవిత

కరోనా కష్టకాలంలో ప్రైవేటు ఉపాధ్యాయులు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అలాంటి సమయంలోనూ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కరోనా ఉపశమన నిధికి తన నగలను విరాళంగా ఇవ్వడానికి కలెక్టర్​ కార్యాలయానికి వెళ్లింది. అయితే కవిత కుటుంబ నేపథ్యం గురించి, డబ్బుకు బదులు బంగారాన్నే ఎందుకు విరాళంగా ఇస్తున్నారని ఆ జిల్లా కలెక్టర్ మేఘనాథ్​ రెడ్డి ఆరా తీశారు.

భర్త చనిపోయిన తర్వాత ఆభరణాలు ధరించడం మానేశానని, మహమ్మారి సమయంలో ప్రజల కష్టాలను చూడలేక వాటిని ఇస్తున్నట్లు చెప్పింది కవిత. ఆమె పెద్ద మనసుకు చలించిపోయిన కలెక్టర్ మేఘనాథ్.. ఆ నగలను ఆమెకే తిరిగి ఇచ్చేశారు.

కవిత కుమారుడిని ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందని, ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేలా చూస్తానని కలెక్టర్​ హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: తండ్రిలా మారిన మామ- వితంతు కోడలికి పెళ్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.