ETV Bharat / bharat

'బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా అసంపూర్ణమే' - విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చి తాజా

వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని భారత్​ తెలిపింది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయితే.. తూర్పు లద్ధాఖ్​లో శాంతి పునురుద్ధరణ సాధ్యమవుతుందని చెప్పింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా మౌలిక వసతుల నిర్మాణాలను చేపడుతోందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో భారత్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Disengagement at lac
భారత్​, చైనా
author img

By

Published : Jun 4, 2021, 6:53 AM IST

వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని భారత్​ పేర్కొంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయితే తూర్పు లద్ధాఖ్​లోని మిగతా ప్రాంతాల్లోనూ బలగాల ఉపసంహరణ సాధ్యమవుతుందని చెప్పింది. తద్వారా సరిహద్దులో శాంతి పునురుద్ధరణ సాధ్యమవుతుందని తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి.. ఫ్రిక్షన్​ పాయింట్ల వద్ద చైనా బలగాలను పెంచటం, మౌలిక వసతులను నిర్మాణానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్​ బాగ్చి ఈ మేరకు సమాధానమిచ్చారు.

"బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఎల్​ఏసీ వద్ద యథాతథ స్థితిని కొనసాగిస్తామని భారత్​, చైనా అంగీకరించాయి. ఈ అవగాహనలను ఉల్లంఘిస్తూ ఇరు పక్షాలు ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదని మేం భావిస్తున్నాం. బలగాల ఉపసంహరణ ఎంత త్వరగా పూర్తయితే... తూర్పు లద్ధాఖ్​లోని మిగతా ప్రాంతాల్లోనూ అంత త్వరగా బలగాలను ఉపసంహరించేందుకు వీలవుతుంది."

- అరిందమ్​ బాగ్చి, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

సెప్టెంబర్ 10 న మాస్కోలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి​ భేటీ అయ్యారు. తూర్పు లద్ధాఖ్​లో ప్రతిష్టంభనకు తెరదించేలా.. ఐదు అంశాల ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఇరు దేశాల నేతలు అంగీకరించారు.

ఇదీ చూడండి: వ్యాక్సినేషన్​లో చైనా జోరు.. 5 రోజుల్లో 10 కోట్లు...

ఇదీ చూడండి: ప్రధాని మోదీకి కమల హారిస్ ఫోన్- టీకాపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.