ETV Bharat / bharat

దివ్యాంగురాలిపై మెకానిక్​ రేప్​.. తల్లిని పక్క రూమ్​లో బంధించి.. - తల్లిని గదిలో బంధించి మహిళపై అత్యాచారం

కేరళలో దారుణం జరిగింది. వృద్ధురాలిని రూమ్​లో బంధించి.. దివ్యాంగురాలైన ఆమె కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ మెకానిక్​. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

differently-abled-woman-raped-by-mechanic
దివ్యాంగురాలిపై మెకానిక్​ అత్యాచారం
author img

By

Published : Apr 14, 2023, 1:50 PM IST

Updated : Apr 14, 2023, 2:26 PM IST

దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఇంట్లో పాడైపోయిన వస్తువులను రిపేర్ చేసేందుకు బాధితురాలి ఇంటికి వచ్చి.. ఆమె తల్లిని ఓ రూమ్​లో బంధించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో తల్లి, కుమార్తె మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఘటన తరువాత బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లింది ఆమె తల్లి. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేరళలోని ఇడుక్కిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇడుక్కి.. తొడుపుజ సమీపంలోని కరీంకున్నంలో బాధితురాలు(46) తన తల్లితో కలిసి నివసిస్తోంది. ఆమె తల్లి వృద్ధురాలు. నిందితుడు మను బాధితురాలి ఇంటికి వస్తువులను రిపేర్​ చేయడానికి వచ్చాడు. ఇంట్లో దివ్యాంగురాలు, వృద్ధురాలైన ఆమె తల్లి మాత్రమే ఉండటం గమనించాడు. వృద్ధురాలిని.. పక్క రూమ్​లో బంధించి తాళం వేశాడు. అనంతరం దివ్యాంగురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.

బాధితురాలి నివాసం చుట్టూ ఇళ్లు లేకపోవడం వల్ల ఈ ఆఘాయిత్యాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. ఘటన తరువాత తీవ్ర అనారోగ్యానికి గురైన కుమార్తెను తొడుపుజ ఆసుపత్రికి తీసుకెళ్లింది ఆమె తల్లి. అనంతరం పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు మనుని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

"బాధితురాలు, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్నాం. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచాం. బాధితురాలు, ఆమె తల్లి న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు." అని తొడుపుజ పోలీసులు తెలిపారు.

NGOలో దారుణం.. మానసిక దివ్యాంగురాలిపై రేప్​.. గర్భం దాల్చిన మైనర్​..
ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రితం మధ్యప్రదేశ్​ ఇందోర్​లో దారుణం జరిగింది. 16 ఏళ్ల మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు గుర్తు తెలియని దుండగుడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. తన కుమార్తెకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి పోలీసులను కోరింది. నిందితుడిపై విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇందోర్​లోని అనుభవి విజన్ సేవా సంస్థాన్​ అనే స్వచ్ఛంద సంస్థలో బాధితురాలు గత నాలుగేళ్లుగా ఉంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

మానసిక దివ్యాంగురాలిపై గ్యాంగ్​రేప్​..
కొద్ది రోజుల క్రితం ఝార్ఖండ్ పలాములో మానసిక దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. నిందితులను ప్రశ్నించేందుకు వెళ్లిన బాధితురాలి తండ్రి, సోదరుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

Last Updated : Apr 14, 2023, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.