Dhoom inspired thieves: హిందీ చిత్రం 'ధూమ్'కు విశేష ఆదరణ ఉంది. అత్యాధునిక బైక్‌లపై హీరోలు చేసే దొంగతనాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అయితే వీటినే స్ఫూర్తిగా తీసుకున్నారు దిల్లీకి చెందిన ఇద్దరు చోరులు. హైఎండ్ రేసింగ్ బైక్‌లపై దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. అయితే పోలీసులకు మాత్రం సాధారణ తనీఖీలో పట్టుబడ్డారు.
ఇంతకీ ఏమైందంటే?
శాస్త్రీ నగర్‌కు చెందిన అర్జున్, భరత్ ఇద్దరూ ఓల్డ్ దిల్లీ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసుల సాధారణ వాహన తనీఖీలో పట్టుబడ్డారు. పోలీసులను చూడగానే వారు యూటర్న్ తీసుకొని పారిపోవడానికి యత్నించారు. అయితే తప్పించుకోలేకపోయారు.
వారిని పట్టుకొని ప్రశ్నించగా.. ధూమ్ స్ఫూర్తితో దిల్లీలోని అనేక ప్రాంతాల్లో దొంగతనాలు, దోపిడీలు చేసినట్లు తెలిపారు. పట్టుబడకుండా ఉండేందుకు కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి దేశీ పిస్టోల్, రెండు లైవ్ కాట్రిడ్జ్‌లు, 10 ఖరీదైన మొబైల్ ఫోన్లు, రెండు రేసింగ్ మోటర్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇదివరకే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: 'ఫారిన్' కోతుల దొంగలు అరెస్ట్.. పక్కాగా స్కెచ్ వేసి మరీ...