ఫిపా ప్రపంచకప్-2022 అర్హత మ్యాచ్లకు మెడికల్ ఆఫీసర్‌గా కర్ణాటక ధార్వాడ్ జిల్లాకు చెందిన డాక్టర్ కిరణ్ కులకర్ణి ఎంపికయ్యారు. ఖతార్లో అక్టోబరు 7, 12 తేదీల్లో జరగనున్న రెండు ప్రీ- క్వాలిఫైయింగ్ రౌండ్‌లకు కులకర్ణిని అధికారిగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్ నియమించింది. దీంతో ఫిఫా వరల్డ్ కప్-2022 ప్రీ-క్వాలిఫయర్స్ మ్యాచ్లకు ఎంపికైన ఏకైక భారతీయ వైద్యుడు కులకర్ణియే కావడం విశేషం.
![Dharwad's doctor selected as medical officer for FIFA World Cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-dwd-1-fifa-football-world-cup-doctor-select-story-ka10001_04102021104657_0410f_1633324617_329_0410newsroom_1633343024_1040.jpg)
![Dharwad's doctor selected as medical officer for FIFA World Cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-dwd-1-fifa-football-world-cup-doctor-select-story-ka10001_04102021104657_0410f_1633324617_224_0410newsroom_1633343024_6.jpg)
ఆసియా జోన్లో అక్టోబరు 7న ఇరాక్-లెబనాన్ మధ్య, అక్టోబరు 12న దక్షిణ కొరియా-టెహరాన్ (ఇరాన్) మధ్య జరగనున్న మ్యాచ్‌లను కులకర్ణి పర్యవేక్షించనున్నారు. క్రీడాకారుల ఇతర సిబ్బంది వైద్య సమస్యలను పర్యవేక్షించడం కులకర్ణి విధి. అలాగే డోపింగ్ కంట్రోల్ ఆఫీసర్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్‌గా కూడా ఆయన పని చేస్తారు. కులకర్ణి గతంలో కూడా పలు అంతర్జాతీయ టోర్నీలకు మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు.
![Dharwad's doctor selected as medical officer for FIFA World Cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-dwd-1-fifa-football-world-cup-doctor-select-story-ka10001_04102021104657_0410f_1633324617_479_0410newsroom_1633343024_902.jpg)
"2022లో ఖతార్లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్‌లో రెండు అర్హత రౌండ్‌లకు మెడికల్, డోపింగ్ కంట్రోల్, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్‌గా నియమితుడయ్యాను. ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్కు చెందిన అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు మెడికల్, డోపింగ్ కంట్రోల్ ఆఫీసర్‌గా కూడా పనిచేశాను. 2017లో భారత్లో జరిగిన ఫిపా యూ-17 ప్రపంచ కప్‌లో గోవా సెక్టార్‌లో కూడా విధులు నిర్వహించాను. ప్రస్తుతం బెంగళూరులోని ఆర్ఎక్స్డీఎక్స్ సమన్వయ్ ఆస్పత్రిలో క్రీడావిభాగంలో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాను" అని కులకర్ణి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కలుషిత నీరు తాగిన ఘటనలో ఆరుకు పెరిగిన మృతులు