దేవుడికి ఓ లేఖలో తమ సమస్యను రాసి.. గుడిలోని ఓ చెట్టుకు కడితే తీర్చుతాడని మల్లన్న సినిమాలో చూసే ఉంటారు. అలాంటి సంఘటనే తమిళనాడు మధురైలోని కల్యాణ సుందరేశ్వర ఆలయంలో నిత్యం జరుగుతోంది. అయితే.. ఇక్కడ ఒకే భక్తుడు రోజూ ఆ శివుడికి లేఖ రాయటం గమనార్హం.
శివుడికి రాస్తున్నట్లు ప్రతిరోజు వెంకటేశ్ అనే వ్యక్తి పేరుతో ఉత్తరం వస్తోందని ఆలయ అధికారులు తెలిపారు. అయితే.. అతని పేరు తప్ప.. చిరునామా, ఇతర వివరాలు ఏమీ లేవని చెప్పారు. అక్టోబర్ 5న వచ్చిన లేఖలో.. మొదటి పేజీలో ' ప్రతి రోజు నాకు సరిపడా ఆదాయం ఇవ్వు', ' మధురైకి చెందిన అనూష అనే అమ్మాయిని నాతో రోజులో ఎక్కువసార్లు మాట్లాడమని చెప్పు దేవుడా' అని రాశాడు.
ఆ అజ్ఞాత భక్తుడి వివరాలు ఏమీ లేకపోవటం, రోజూ ఒక లేఖ రావటంపై ఆలయ అధికారులు అయోమయంలో పడ్డారు. వారితో పాటు ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన పూజారులు