ETV Bharat / bharat

ఎర్రకోటపై రైతుల జెండా - ట్రాక్టర్​ ర్యాలీ

పోలీసులు నిర్దేశించిన మార్గాలు కాకుండా ఇతర మార్గాల్లో ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహిస్తున్న రైతులు.. ఎర్రకోటలోకి ప్రవేశించారు. అక్కడ జాతీయ జెండా ఎగరవేసే స్తంభానికి వేర్వేరు రైతు సంఘాల జెండాలు కట్టారు.

farmer protest, redfort
ఎర్రకోటలోకి ప్రవేశించిన రైతులు
author img

By

Published : Jan 26, 2021, 2:15 PM IST

Updated : Jan 26, 2021, 2:28 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్న రైతుల్లో కొందరు ఎర్రకోటలోకి ప్రవేశించారు. అక్కడే జెండాలు ఎగరవేసి తమ నిరసన తెలిపారు.

ట్రాక్టర్ పరేడ్​కు పోలీసులు అనుమతించిన దారులకు భిన్నంగా రైతులు ఇతర మార్గాల్లో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. రాజధానిలోని వివిధ సరిహద్దు ప్రాంతాల్లో బారికేడ్లను దాటుకుని రైతులు నగరంలోకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం జరిగిన ఈ నిరసల్లో రైతులను అదుపు చేయడానికి బాష్పవాయువును ప్రయోగించడం సహా లాఠీ ఛార్జ్​ చేశారు.

ఎర్రకోటలోకి ప్రవేశించిన రైతులు

పోలీసుల అనుమతి ప్రకారం రాజపథ్​లో పరేడ్​ ముగిసిన తర్వాత నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే రైతులు ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించాల్సి ఉంది. కానీ ముందస్తు ఒప్పందానికి విరుద్ధంగా రైతులు ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశించారు. ఫలితంగా చింతామణి చౌక్​, ముకర్బా చౌక్​, నంగ్​లోయ్​ చౌక్​ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఇదీ చదవండి : సైనిక సత్తా చాటిన గణతంత్ర ప్రదర్శన

Last Updated : Jan 26, 2021, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.