ETV Bharat / bharat

'మోదీజీ... నేతాజీ రహస్య పత్రాల సంగతేంటి?' - bengal cm news

నేతాజీ సుభాష్​ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనవరి 23న బంగాల్​లో 'దేశ్​ నాయక్​ దివస్​' నిరహ్విస్తామని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఆ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రవాస భారతీయుల సహా దేశంలోని ప్రతి ఒక్కరు శంఖం ఊది నేతాజీని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. సుభాష్​ చంద్రబోస్​కు సంబంధించిన రహస్య సమాచారాన్ని కేంద్రం ఇప్పుడైనా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

'Desh Nayak Diwas' will be observed in the state on 23rd January: mamata
నేతాజీ జయంతి రోజున 'దేశ్ నాయక్​ దివస్': మమత​
author img

By

Published : Jan 4, 2021, 6:19 PM IST

Updated : Jan 4, 2021, 10:26 PM IST

నేతాజీ సుభాష్​ చంద్రబోస్​కు సంబంధించిన రహస్య సమాచారాన్ని కేంద్రం ఇప్పుడైనా బయటపెట్టాలని డిమాండ్ చేశారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా కోల్​కతాలో ర్యాలీ నిర్వహించనున్నట్లు మమత తెలిపారు. శ్యాంబజార్​ నుంచి నేతాజీ విగ్రహం వరకు పోలీస్ బ్యాండ్​తో ఈ కార్యక్రమం జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు విదేశాల్లోని భారతీయులు సహా దేశంలోని ప్రతి ఒక్కరు శంఖం ఊది నేతాజీకి నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు.

నేతాజీ జయంతి రోజైన జనవరి 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్​ చేస్తూ కేంద్రానికి లేఖ రాసినట్లు మమత తెలిపారు. ఆ రోజు బంగాల్​లో 'దేశ్​ నాయక్​ దివస్' నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం నేతాజీ కోసం మనం ఏం చేయలేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. నేతాజీకి సంబంధించిన అన్ని ఫైళ్లను కేంద్రం ఇప్పుడైనా బహిర్గతం చేయాలని కోరారు.

అసెంబ్లీ సెషన్​..

త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని మమత తెలిపారు. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెడతామని వెల్లడించారు.

ఇదీ చూడండి: కమల్​ వివాదస్పద ట్వీట్​- చిన్మయి ధ్వజం

Last Updated : Jan 4, 2021, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.