ETV Bharat / bharat

పొంచి ఉన్న 'యాస్​' ముప్పు- అధికారులు అప్రమత్తం - Odisha coast

యాస్​ తుపాను అతి తీవ్ర తుపానుగా మారి.. ఈ నెల 26న ఒడిశా- బంగాల్​ మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో.. ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో.. తూర్పు తీర రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేశాయి. ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలను మోహరించారు. యాస్​ తుపాను సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ.. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Depression in Bay of Bengal to develop into cyclonic storm by Monday: IMD
పొంచి ఉన్న 'యాస్​' ముప్పు
author img

By

Published : May 23, 2021, 4:49 PM IST

తౌక్టే తుపాను విలయం నుంచి కోలుకోక ముందే 'యాస్'​ రూపంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. తూర్పు మ‌ధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప‌ పీడ‌నం ఈ రాత్రికి వాయుగుండంగా మారుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఉత్త‌ర వాయవ్య దిశ‌గా క‌దిలి సోమవారం తుపానుగా మారే సూచ‌న‌లు ఉన్నాయ‌ని తెలిపింది. ఆ త‌ర్వాత 24 గంట‌ల్లో తీవ్ర తుపానుగా బ‌ల‌ప‌డుతుంద‌ని పేర్కొంది. అనంత‌రం ఉత్త‌ర వాయవ్యంగా క‌దిలి పెను తుపానుగా మారే సూచ‌న‌లున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

ఈ నెల 26న ఉద‌యం ఒడిశా- బంగాల్ తీరాన్ని తాకి, అదే రోజు సాయంత్రం పారాదీప్​, సాగర్​ దీవుల్లో తీరం దాట‌వ‌చ్చ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ పేర్కొంది. తీరం దాటే సమయంలో.. గంటకు 150 -180 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది.

మోదీ సమీక్ష..

కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో తూర్పు తీర రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేశాయి. ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలను మోహరించారు అధికారులు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు..!

యాస్ తుపాను సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రిత్వ శాఖల అధికారులతో వర్చువల్‌గా సమావేశమైన మోదీ.. యాస్ తుపాను సన్నద్ధత, ముందస్తు జాగ్రత్త చర్యలపై సమీక్షించారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. ఈ భేటీలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు, టెలికాం, విద్యుత్, పౌరవిమానయాన అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రాలు అప్రమత్తం..

వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తుపానును ఎదుర్కొనేందుకు బంగాల్​ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను వేగవంతం చేసింది. యాస్‌ తుపానుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం మమతా బెనర్జీ.. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పరిస్థితిని పరిశీలించేందుకు కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామన్న మమత.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీరం దాటే సమయంలో అక్కడి నుంచి సీఎం పరిస్థితిని పర్యవేక్షిస్తారని అధికారులు తెలిపారు.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ కూడా యాస్‌ తుపానుపై సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. యాస్ తుఫాను ధాటికి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని తీరప్రాంతాల కలెక్టర్లు, ఎస్పీలను సూచించారు. తుపాను తీరం దాటే వరకు పరిస్థితులను నిత్యం పరిశీలించాలన్న ఆయన ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే విపత్తు నిర్వహణ దళాలను మోహరించామని తెలిపారు. ఓడీఆర్​ఏఎఫ్​, ఎన్​డీఆర్​ఎఫ్​, అగ్నిమాపక దళాలను తరలించామని ఒడిశా ముఖ్యమంత్రి వెల్లడించారు. చేపల వేటకు వెళ్లిన వారందరూ తిరిగి వచ్చేశారని ప్రభుత్వం తెలిపింది.

నావికా దళం, ఐసీజీ రెడీ..

యాస్‌ తుపాను నేపథ్యంలో భారత నావికా దళం అప్రమత్తమైంది. మొత్తం నాలుగు యుద్ధ నౌకలు, అనేక విమానాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, గోవాలో సహాయ చర్యలు చేపడతామని తెలిపింది. విశాఖ వద్ద ఉన్న ఐఎన్​ఎస్​ డేగా, చెన్నైకి సమీపంలో ఉన్న ఐఎన్​ఎస్​ రాజాలిపై నావికా దళ విమానాలు సిద్ధంగా ఉన్నాయని... ఇవి తుపాను సమయంలో ఏరియల్ సర్వే చేసి సహాయ చర్యలు చేపడతాయని నేవీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత నావికాదళం తుపాను కదలికలను నిశితంగా పరిశీలిస్తోందని వెల్లడించింది.

యాస్‌ తుపానును ఎదుర్కొనేందుకు తీర ప్రాంత రక్షణ దళం ఐసీజీ కూడా అప్రమత్తమైంది. తూర్పు తీర ప్రాంత రక్షణ దళం ముందస్తు చర్యలను ప్రారంభించింది. ఐసీజీ కేంద్రాలు, ఓడలు, విమానాలు హై అలర్ట్‌లో ఉన్నాయని తెలిపింది. తూర్పు తీరంలో చేపల వేటను ఇప్పటికే నిషేధించినట్లు తెలిపిన ఐసీజీ.. నౌకలు, విమానాల ద్వారా సముద్రంలో ఉన్నవారికి హెచ్చరికలు చేస్తున్నామని వెల్లడించింది.

ఇవీ చూడండి: 'వ్యాక్సినేషన్​కు ఇబ్బంది లేకుండా తుపాను చర్యలు'

యాస్​ తుపాను సన్నద్ధతపై మోదీ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.