ETV Bharat / bharat

లిక్కర్​కు రూ.50 ఇవ్వలేదని స్నేహితులను పొడిచిన బాలుడు - బాలుడి కత్తి దాడి

తాగుడుకు బానిసైన ఓ బాలుడు మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఇద్దరి స్నేహితులను కత్తితో పొడిచాడు. నిందుతుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగేటప్పుడు అతని వెంట మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు.

juvenile stabs two friends
కత్తి దాడి
author img

By

Published : Jul 30, 2021, 10:01 PM IST

మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని తన స్నేహితులిద్దరిని కత్తితో గాయపరిచిన ఓ 17 ఏళ్ల బాలుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్​ చేశారు. గాయపడిన ఇద్దరు దిల్లీ సమీపంలోని బిందాపుర్​కు చెందిన సందీప్​, ఓంలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు నిందితుని వెంట మరో ఇద్దరు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఈ దాడిలో గాయపడిన సందీప్ అనే యువకుడి శరీరంలో 7 కత్తిపోట్లు దిగినట్లు అధికారులు తెలిపారు. చేతికి, నడుముపై ప్రధానంగా గాయాలైనట్లు పేర్కొన్నారు. అయితే అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. మరో యువకుడు ఓం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారని వివరించారు. జులై 24న దిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది..

సందీప్​, ఓం స్కూటర్​పై వెళ్లుండగా వారిని నిందితుడు బిందాపుర్​లో కలిశాడు. మద్యం తాగడానికి రూ. 50 అడిగాడు. అందుకు సందీప్​ నిరాకరించడం వల్ల అతనితో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కత్తితో దాడికి దిగారు. ఈ క్రమంలోనే నిందితుడు వారిని కత్తితో పొడిచి గాయపరిచాడు. మిగిలిన ఇద్దరు మిత్రులు అక్కడి నుంచి పరారయ్యారు.

నిందితుడు మరో 5 ఇతర కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: ఎయిర్​పోర్టులో కలకలం- ఒకేసారి ఆరు తుపాకులతో...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.