ETV Bharat / bharat

White fungus: రోగి పేగులకు సోకిన వ్యాధి - delhi white fungus

దిల్లీలో ఆందోళనకరమైన వైట్ ఫంగస్ కేసు బయటపడింది. శరీరంలోని పేగులు, ఆహార వాహికకు ఈ ఫంగస్ సోకింది. కరోనా వెలుగుచూసిన తర్వాత ఈ తరహా కేసు నమోదు కావడం ఇదే తొలిసారని వైద్యులు చెబుతున్నారు.

Rare case of white fungus reported in Delhi
White fungus: రోగి పేగులకు సోకిన వైట్ ఫంగస్
author img

By

Published : May 27, 2021, 3:46 PM IST

ఆందోళన కలిగించే వైట్ ఫంగస్(White fungus) కేసు ఒకటి దిల్లీలో బయటపడింది. రోగి శరీరంలోని పేగులు, ఆహారవాహిక(ఎసోఫాగస్)కు వైట్ ఫంగస్ సోకింది. సర్ గంగారాం ఆస్పత్రి(Sir Ganga Ram Hospital)లో ఓ మహిళా రోగికి ఈ వ్యాధి నిర్ధరణ అయింది.

తీవ్రమైన కడుపు నొప్పితో మహిళ మే 13న ఆస్పత్రిలో చేరిందని ఆస్పత్రి వైద్యుడు అనిల్ అరోరా తెలిపారు. గతేడాది డిసెంబర్​లో రొమ్ముక్యాన్సర్​ బారిన పడిన ఆమె చికిత్స తీసుకుంటున్నారని.. నాలుగు వారాల క్రితం వరకు ఆమెకు కీమోథెరపీ జరిగిందని చెప్పారు.

"స్టెరాయిడ్లు వాడటం మూలాన ఓ వైట్ ఫంగస్ కేసు నమోదైంది. ఆహార నాళానికి, పెద్ద పేగు, చిన్నపేగులకు వైట్ ఫంగస్ సోకడం.. కొవిడ్(covid-19) వెలుగుచూసిన తర్వాత ఇదే తొలిసారి. మహిళలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంది. నాలుగు వారాల క్రితం ఆమెకు కీమోథెరపీ జరిగింది. ప్రతికూల ప్రభావానికి ఇదీ ఓ కారణం అయి ఉండొచ్చు."

-డా. అనిల్ అరోరా, లివర్ గ్యాస్ట్రోఎంటరోలజీ, ప్యాంక్రియాటికో బిలియరీ సైన్సెస్ సంస్థ ఛైర్మన్

ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు బాధితురాలి పరిస్థితి ఆందోళకరంగా ఉందని చెప్పారు అరోరా. ఊపిరి తీసుకోలేని స్థితిలో ఆమె ఉన్నారని తెలిపారు. చికిత్సలో భాగంగా రోగి కడుపులోని ద్రవాలను తొలగించామని వివరించారు. అనంతరం శస్త్రచికిత్స చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, మరికొద్ది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి- PPE Kit: వాడేసినవి మార్కెట్లో మళ్లీ విక్రయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.