ETV Bharat / bharat

రాహుల్​ 'ట్రాక్టర్​ మార్చ్'​పై పోలీసుల దర్యాప్తు - పార్లమెంటు

వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తూ రాహుల్​ గాంధీ పార్లమెంటుకు సోమవారం ట్రాక్టర్​ మార్చ్ చేయడంపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్లు ఎలా వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Rahul Gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : Jul 27, 2021, 5:23 PM IST

పార్లమెంటుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ట్రాక్టర్​ మార్చ్​పై దర్యాప్తు చేపట్టారు దిల్లీ పోలీసులు. పార్లమెంటు ప్రాంగణంలోకి ట్రాక్టర్లకు అనుమతిలేదని పోలీసులు తెలిపారు. జనవరి 26 హింసాత్మక ఘటనల నేపథ్యంలో వాటిపై నిషేధం విధించినప్పటికీ సెంట్రల్ దిల్లీకి ఎలా తీసుకొచ్చారనే అంశాన్ని దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఓ కంటైనర్​లో రహస్యంగా ట్రాక్టర్​లను తరలించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సమాచారం సేకరిస్తున్నారు. పార్లమెంటుకు కొద్ది దూరంలోనే ట్రాక్టర్​లను నిలిపి ఉంచి, వాటిని గుర్తుపట్టకుండా బోర్డులను ఏర్పాటు చేసినట్లు తేల్చారు.

రైతు సందేశాన్నిచ్చేందుకే..

Rahul Gandhi
పార్లమెంటుకు ట్రాక్టర్​పై వస్తున్న రహూల్, కాంగ్రెస్ నేతలు

రైతులకు మద్దతుగా సాగు చట్టాలను రద్దు చేయాలని నిరసిస్తూ పార్లమెంటుకు సోమవారం స్వయంగా ట్రాక్టర్​ నడుపుతూ వచ్చారు రాహుల్. సమావేశాల్లో ఈ వ్యవహారంపై చర్చించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. రైతులను భాజపా అణచివేస్తోందని, అన్నదాతల సందేశాన్ని చేరవేయడానికే పార్లమెంటుకు ట్రాక్టర్​పై వచ్చినట్లు రాహుల్ తెలిపారు.

ఇదీ చూడండి: దిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళా రైతుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.