ETV Bharat / bharat

'ఛలో దిల్లీ'కి పోలీసులు ఓకే- రైతుల హర్షం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు దిల్లీలోకి ప్రవేశించేందుకు ఎట్టకేలకు అక్కడి పోలీసులు అంగీకరించారు. అయితే, పోలీసుల పహారాలోనే వారంతా నగరంలోకి రావాలని షరతు విధించారు. కేంద్రం నిర్ణయాన్ని.. పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ స్వాగతించారు. ఉదయం నుంచి.. దిల్లీ సరిహద్దులోని సింఘు ప్రాంతం సహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.

Delhi Police confirms protesting farmers allowed entry into national capital
దిల్లీ వెళ్లేందుకు రైతులకు అనుమతి..
author img

By

Published : Nov 27, 2020, 3:48 PM IST

'ఛలో దిల్లీ' పేరిట దిల్లీకి పయనమైన పంజాబ్​, హరియాణా రైతులు దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు అక్కడి పోలీసులు అనుమతిచ్చారు. బురారీలోని నిరంకారీ మైదానంలో శాంతియుతంగా నిరసన చేసుకోవచ్చని దిల్లీ పోలీసు కమిషనర్​ స్పష్టం చేశారు. అయితే.. పోలీసుల పహారాలోనే రైతులంతా నగరంలోకి రావాలని షరతు విధించారు.

దిల్లీలోకి ప్రవేశించిన రైతులు..

పోలీసుల అనుమతితో రైతులు దిల్లీలోకి ప్రవేశించారు. టిక్రీ సరిహద్దు గుండా నిరంకారీ సమగం మైదానానికి చేరుకుంటున్నారు.

Delhi Police confirms protesting farmers allowed entry into national capital
దిల్లీలోకి ప్రవేశించిన రైతులు

దిల్లీలోకి ప్రవేశించేందుకు పోలీసులు అనుమతించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. పరిపాలనా విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు. సమస్యకు శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

దిల్లీకి బయల్దేరుతున్న రైతులు

స్వాగతించిన సీఎం..

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ స్వాగతించారు. రైతులకు శాంతియుతంగా నిరసన చేసుకునే హక్కు ఉందని పునరుద్ఘాటించారు. రైతులతో చర్చించి.. వారి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.

ఉదయం నుంచి ఉద్ధృతంగా ఆందోళనలు..

ఉదయం నుంచి దిల్లీ-హరియాణా సరిహద్దుల వద్ద పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావారణం నెలకొంది.

సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితి

ఇదీ చూడండి: రైతుల 'ఛలో దిల్లీ' మార్చ్​లో​ మరోసారి ఉద్రిక్తత

రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

రైతులపై బాష్పవాయువు ప్రయోగం

అంబాలా శంబూ సరిహద్దు వద్ద ఆందోళన

అంబాలాలోని శంబూ సరిహద్దు వద్ద వంతెనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాక్టర్లపై వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులపై జల ఫిరంగులు ప్రయోగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.