ETV Bharat / bharat

'దిల్లీ బిల్లు'కు లోక్​సభ పచ్చజెండా.. ప్రజల మంచికోసమే చట్టమన్న అమిత్ షా.. వెన్నుపోటు అంటూ కేజ్రీ ఫైర్ - AAP MP Suspended

Delhi ordinance bill passed in Lok Sabha : దిల్లీ సేవల నియంత్రణ బిల్లుకు లోక్​సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాజ్యాంగబద్ధమైనదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దిల్లీ ప్రజలకు ఇది మేలు చేస్తుందని చెప్పారు.

Delhi National Capital Territory Amendment Bill

author img

By

Published : Aug 3, 2023, 7:38 PM IST

Updated : Aug 3, 2023, 8:15 PM IST

Delhi ordinance bill passed in Lok Sabha : దిల్లీలో సీనియర్ అధికారుల పోస్టింగులు, బదిలీలపై అధికారాలను ఎల్​జీకి కట్టబెడుతూ రూపొందించిన బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. దిల్లీ సేవల నియంత్రణ ఆర్డినెన్స్‌ స్థానంలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు వైసీపీ, బీజేడీ మద్దతు ఇచ్చాయి. ఈ బిల్లు రాజ్యాంగబద్ధమైనదేనని కేంద్ర హోంమంత్రి లోక్​సభలో పేర్కొన్నారు. రాజధానిలోని ప్రజలకు ఇది ప్రయోజనం కలిగిస్తుందని తెలిపారు. దిల్లీ సేవలు ఎప్పటికీ కేంద్రంతోనే ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల తీర్మానాలపై ఓటింగ్ నిర్వహించగా.. సభ వాటిని తిరస్కరించింది. అనంతరం సభ్యులు బిల్లును మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ చర్చలో పాల్గొన్న బీజేడీ ఎంపీ పినాకి మిశ్ర.. దిల్లీకి సంబంధించి ఎలాంటి చట్టమైన చేసే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. ఓటింగ్ సమయంలో విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.

  • #WATCH | Union Home Minister Amit Shah says, "Even after the I.N.D.I.A. alliance, PM Modi will become the Prime Minister again with full majority...All bills are important & you should have been present in House...After this (Delhi Services bill) bill is passed the alliance will… pic.twitter.com/soZV8Da4mW

    — ANI (@ANI) August 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Delhi Ordinance Bill Amit Shah : ఈ బిల్లుపై లోక్​సభలో నాలుగు గంటల సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా.. దిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి.. దానిపై చట్టం చేసే సర్వహక్కులూ కేంద్రానికి ఉంటాయని తెలిపారు. నిబంధనల అమలుకూ కేంద్రానికి హక్కు ఉందని చెప్పారు. బిల్లు పాసైన తర్వాత విపక్ష కూటమి కుప్పకూలిపోతుందని జోస్యం చెప్పారు. దిల్లీలోని ఆప్ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలను సైతం సకాలంలో నిర్వహించడం లేదని ఆరోపించారు. కేబినెట్ సమావేశాలు కూడా తరచుగా జరగడం లేదని అన్నారు.

  • #WATCH | Union Home Minister Amit Shah in Lok Sabha says, "Services have always been with the Central government. SC gave an interpretation...From 1993 to 2015 no Chief Minister fought. There were no fights because whichever govt was formed their aim was to serve the people.… pic.twitter.com/lAld2rMOF2

Delhi Ordinance Bill pass Kejriwal reaction : బిల్లు లోక్​సభలో పాసైన అనంతరం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. దిల్లీకి బీజేపీ వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. అంతకుముందు మాట్లాడిన ఆయన.. దిల్లీ సర్వీసుల బిల్లుకు అనుకూలంగా అమిత్ షా వద్ద సరైన వాదన ఒక్కటీ లేదని అన్నారు. తప్పు చేస్తున్నామన్న విషయం వారికి కూడా తెలుసని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ బిల్లు దిల్లీ ప్రజల హక్కులను లాగేసుకుంటుందని ఆరోపించారు.

  • #WATCH | Union Home Minister Amit Shah says, "The opposition's priority is to save their alliance. The opposition is not worried about Manipur...Everyone is talking about the rights of a state. But which state? Delhi is not a state but a Union Territory...The Parliament has the… pic.twitter.com/9ivxALDKfB

మరో ఆప్ ఎంపీపై వేటు..
AAP MP Suspended : ఇదిలా ఉండగా.. మరో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీపై సస్పెన్షన్ వేటు పడింది. సభా సంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ఆప్‌ ఎంపీ సుశీల్‌కుమార్‌ రింకూను ఈ సమావేశాల వరకు సస్పెండ్‌ చేశారు స్పీకర్ ఓంబిర్లా. స్పీకర్‌ వైపు పత్రాలు విసిరినందుకు ఆప్‌ ఎంపీ సుశీల్‌పై చర్యలు తీసుకున్నారు. సుశీల్‌ సస్పెన్షన్‌పై పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ దాన్ని ఆమోదించింది. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రకటన చేశారు ఓంబిర్లా. ఇటీవల ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను సైతం సమావేశాల నుంచి సస్పెండ్ అయ్యారు.

  • #WATCH | AAP MP Sushil Kumar Rinku suspended from Lok Sabha for the remainder of the monsoon session for throwing papers at the Chair.

    Parliamentary Affairs Minister Pralhad Joshi moved the motion. Speaker Om Birla sought approval of the House before announcing the decision. pic.twitter.com/RbVrezUvza

Last Updated : Aug 3, 2023, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.