ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ గోప్యతా విధానంపై సమాచారం కోరుతూ డైరెక్టర్ జనరల్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఇచ్చిన నోటీసులపై స్టే విధించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రముఖ సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్‌బుక్‌ల నూతన గోప్యతా విధానాలపై దర్యాప్తునకు సంబంధించిన అంశంపై నిర్దిష్ట సమాచారాన్ని అందించాలని సదరు సంస్థలకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నోటీసులు ఇచ్చింది.
ఇప్పటికే ఈ దర్యాప్తులో తదుపరి దశను నిలిపేయాలని కోరుతూ దరఖాస్తు దాఖలైందని జస్టిస్ అనుప్ జైరాం భంభానీ, జస్మీత్ సింగ్‌ల ధర్మాసనం గుర్తుచేసింది. ఇందులో సీసీఐ డైరెక్టర్ జనరల్‌కు జారీ అయిన నోటీసుపై.. మే 6న డివిజన్ బెంచ్ మధ్యంతర స్టే విధించేందుకూ నిరాకరించిందని పేర్కొంది.
కొత్త గోప్యతా విధానానికి సంబంధించి.. సీసీఐ ఆదేశించిన దర్యాప్తునకు వ్యతిరేకంగా తమ అభ్యర్థనలను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుపై ఫేస్‌బుక్, వాట్సాప్‌లు దిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేశాయి. ఈ అప్పీళ్లపై ఇంతకుముందే(జూన్ 4 న) నోటీసులు జారీ చేసిన దిల్లీ హైకోర్టు.. దీనిపై స్పందించాలని కేంద్రాన్ని కోరింది.
ఇవీ చదవండి: