దేశ రాజధాని దిల్లీలో అత్యవసర సేవలు మినహా మిగిలిన ఉద్యోగుల్లో 50 శాతం మందికి ఇంటి నుంచి పని(వర్క్ ఫ్రమ్ హోమ్) చేసే సౌకర్యం కల్పించింది అక్కడి ప్రభుత్వం. పెరుగుతున్న కేసులు, వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేజ్రీవాల్ సర్కార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు సంస్థల్లో కూడా వీలైనంత తక్కువ మంది ఆఫీసులలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
గ్రేడ్ వన్ అధికారులతో ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయి. మిగతా వారిలో 50శాతం మందికి ఇంటి నుంచి పని చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉత్తర్వులు డిసెంబర్ 31 వరకు కొనసాగుతాయి. ప్రైవేటు సంస్థలు కూడా వారి వారి ఉద్యోగులకు ఇలాంటి అవకాశం ఇవ్వాలి.
- విజయ్ కుమార్ దేవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి