వాయుకాలుష్యం తారస్థాయికి చేరిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం (Delhi Pollution News) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నగరంలో పలు ఆంక్షలు విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పాఠాశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
నిర్మాణ, కూల్చివేత పనులను (Delhi Pollution News) ఆదివారం వరకు నిలివేయడం సహా ప్రభుత్వోద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం కల్పిస్తున్నట్లు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం ప్రకటించారు.
గోపాల్ రాయ్ ప్రెస్‌మీట్ హైలైట్స్:
- అత్యవసర సేవలు మినహా దిల్లీలోకి ఏ వాహనాన్నీ అనుమతించట్లేదు. ఈ దిశగా పోలీస్, రవాణా శాఖలు కృషి చేయనున్నాయి.
- ప్రజా రవాణాను పెంచేందుకు 1000 ప్రైవేట్ సీఎన్జీ బస్సులను దిల్లీ ప్రభుత్వం అద్దెకు తీసుకోనుంది. గురువారం ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మెట్రో రైళ్లలో ప్రస్తుతం అమలులో ఉన్న కొవిడ్ ఆంక్షల సడలింపును కూడా దిల్లీ ప్రభుత్వం పరిశీలించనుంది.
- 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాల రాకపోకలను కట్టడి చేసే దిశగా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్ పంప్‌ల వద్ద పొల్యూషన్ చెక్‌లను మరింత కట్టుదిట్టం చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
- ప్రస్తుతం 372 వాటర్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయగా.. అగ్నిమాపక శాఖ సాయంతో మరో 13 హాట్స్పాట్లలో వాటర్ స్ప్రింక్లర్లను అందుబాటులోకి తేనుంది.
- పరిశ్రమలకు మాత్రమే గ్యాస్ వినియోగానికి అనుమతించింది. కలుషిత ఇంధనాన్ని వినియోగిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇదీ చూడండి : తల్లడిల్లిపోయిన గజరాజులు.. బుల్లి ఏనుగు ప్రాణాలతో లేదని తెలియక...