ETV Bharat / bharat

రాహుల్​పై అభిమానం.. రూ.లక్షల ఆస్తిని రాసిచ్చిన మహిళ

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీకి తన ఆస్తినంతా రాసిచ్చింది దెహ్రాదూన్​కి చెందిన ఓ మహిళ. తన తదనంతరం రాహుల్​కు ఆస్తి దక్కేలా వీలునామాను కోర్టుకు సమర్పించింది.

Rahul Gandhi
రాహుల్​గాంధీ
author img

By

Published : Apr 4, 2022, 3:57 PM IST

Updated : Apr 4, 2022, 6:44 PM IST

Rahul Gandhi: ఉత్తరాఖండ్​ రాజధాని దెహ్రాదూన్​కి చెందిన ఓ మహిళ.. తన ఆస్తినంతా కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ పేరుపై రాసిచ్చింది. నగరంలోని నెహ్రూ కాలనీకి చెందిన మేఘరాజ్​ కుమార్తె పుష్పమంజీలాల్​ తన పేరుపై ఉన్న మొత్తం ఆస్తులను రాహుల్​ గాంధీకి ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన వీలునామా పత్రాలను కోర్టులో సమర్పించింది. రాహుల్​ గాంధీ ఆలోచనలు తనను బాగా ప్రభావితం చేశాయని.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి నేటి వరకు గాంధీ కుంటుంబం అత్యున్నత త్యాగాలను చేసిందని తెలిపింది.

కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఆలోచనలతో ప్రభావితమయ్యే తన ఆస్తికి వారసుడిగా ఎంపికచేసినట్లు మహిళ తెలిపింది. ఆమెకు సంబంధించిన ఆస్తి పత్రాలు సహా ఇతర పత్రాలను కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రీతమ్​సింగ్​కు అందజేసినట్లు ఆ పార్టీ మెట్రోపాలిటన్ అధ్యక్షుడు లాల్‌చంద్ శర్మ తెలిపారు. తన తదనంతరం ఆస్తి మొత్తాన్ని రాహుల్ గాంధీకి అప్పగించాలని పుష్ప.. కోర్టును అభ్యర్థించింది. ఈమె పేరుపై రూ.50 లక్షల ఫిక్స్​డ్​ డిపాజిట్​లు, 10 తులాలల బంగారం ఉన్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్​ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీ దేశానికి ప్రధానమంత్రులుగా సేవలందించారు. రాహుల్ తల్లి సోనియా గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్​ అధ్యక్షురాలిగా ఉండగా.. ఆయన సోదరి ప్రియాంక గాంధీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు

పత్రాలను అందజేస్తున్న మహిళ

ఇదీ చదవండి: ఆధార్​ కార్డులోని పేరు తెచ్చిన చిక్కు.. స్కూల్​ అడ్మిషన్​ తిరస్కరణ!

Last Updated : Apr 4, 2022, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.