భారత నౌకాదళం కోసం 6 సంప్రదాయ జలాంతర్గాముల నిర్మాణం చేపట్టే మెగా ప్రాజెక్టుకు రక్షణశాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో రక్షణ కొనుగోళ్ల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పి-75 పేరుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం టెండర్ నోటిఫికేషన్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.
'భారత్లో తయారీ' కింద ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.43వేల కోట్లు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చైనా నావిక దళ సామర్థ్యంతో సరితూగే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.
ఇదీ చూడండి: దేశీయంగా ఆరు జలాంతర్గాముల నిర్మాణం!