రాజ్‌పథ్ వేదికగా నిర్వహించిన గణతంత్ర పరేడ్ 2021లో ఉత్తమ కవాతు చేసిన సిబ్బందికి 'బెస్ట్ మార్చింగ్' అవార్డులను అందజేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ పురస్కారాల కోసం మూడు ఉత్తమ బృందాలను అధికారులు ఎంపిక చేశారు. వీటిలో ఒకటి జాట్ రెజిమెంటల్ కేంద్రం. సీఏపీఫ్, ఇతర సహాయక దళాల్లో మాత్రం ఈ అవార్డును దిల్లీ పోలీసులు గెలుచుకున్నారు.
"గణతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఒక్కరు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఏడాది పొడవునా కొవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ.. రిపబ్లిక్ పరేడ్‌ను సిద్ధం చేసినందుకు నేను అందరినీ అభినందిస్తున్నాను. దేశంలో ఉండే 'భిన్నత్వంలో ఏకత్వం'కు ఈ పరేడ్‌నే సాక్ష్యం. రిపబ్లిక్ పరేడ్ చూసినప్పుడల్లా.. నేను ముఖ్యంగా బృందాలు చేసే కవాతునే నిశితంగా గమనిస్తాను. ఏ బృందం చేసే కవాతు ఉత్తమమైనదో అంచనా వేయడం చాలా కష్టం. నా దృష్టిలో ప్రతిదీ బాగా చేసినట్లుగానే భావిస్తాను."
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
రాజ్‌పథ్‌లో పరేడ్ నిర్వహించడం అంటే... దేశ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి చాటడమే అని అన్నారు రాజనాథ్. ఈ క్రమంలో దిల్లీ పోలీసులు సేవలను కొనియాడారు. దేశా రాజధాని దిల్లీలో ఉన్నందును కొన్ని విదేశీ శక్తులు రాజధానినే లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నే అస్కారం ఉంటుందని తెలిపారు. ఇది దిల్లీ పోలీసులకు సవాలుతో కూడిన విషయంమని అభిప్రాయపడ్డారు. మిగత రాష్ట్రాల పోలీసుల కన్న దిల్లీ పోలీసులపైనే ఎక్కువ బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు.