ETV Bharat / bharat

వాయుసేన కోసం అత్యాధునిక శాటిలైట్​ వ్యవస్థ

వాయుసేన కోసం కేంద్రం రూ.2236 కోట్లతో అత్యాధునిక శాటిలైట్​ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. 'భారత్‌లో తయారీ' కింద ఈ సామాగ్రిని సమకూర్చుకోనున్నట్లు రక్షణశాఖ (Defence Acquisition Council) ప్రకటనలో తెలిపింది.

defence acquisition council
వాయుసేన
author img

By

Published : Nov 24, 2021, 5:43 AM IST

Updated : Nov 24, 2021, 7:04 AM IST

భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్​ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం మంగళవారం ఆమోదం తెలిపింది. కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత విస్తృతం చేసేందుకుగాను రూ. 2236 కోట్లతో (Defence Acquisition Council) ప్రత్యేక సామగ్రి కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జీశాట్‌-7సీ ప్రత్యేక ఉప్రగహం, సంబంధిత సామగ్రిని ఐఏఎఫ్‌ సమకూర్చుకోనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశంలో (Defence Acquisition Council) ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఐఏఎఫ్‌ ఆధునికీకరణ, నిర్వహణ అవసరాలకు గాను 'భారత్‌లో తయారీ' కింద ఈ సామాగ్రిని సమకూర్చుకోనున్నట్లు రక్షణశాఖ (Defence Acquisition Council) ప్రకటనలో తెలిపింది. సాఫ్ట్​వేర్​-డిఫైన్డ్​ రేడియోల (ఎస్‌డీఆర్‌లు) గ్రౌండ్​ హబ్‌లు.. జీశాట్‌-7సీ ఉపగ్రహం పూర్తి డిజైన్‌, అభివృద్ధి ప్రయోగం వంటివి ఈ ప్రాజెక్టులో ఉన్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి : 'ఆ పార్టీ ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారు.. కానీ ఆ చెత్త మాకెందుకు?'

Last Updated : Nov 24, 2021, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.