ETV Bharat / bharat

ఎన్నికల్లో ఘోర ఓటమి.. కోపంతో ఆ అభ్యర్థి ఏం చేశాడంటే..?

author img

By

Published : Mar 5, 2022, 12:10 PM IST

defeated sarpanch candidate digs road: ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు ఓ వ్యక్తి. కోపంతో రోడ్డును తవ్వేశాడు. ఈ ఘటనపై స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?

digs on the road
రోడ్డుకి అడ్డంగా బండరాళ్లు

defeated sarpanch candidate digs road: పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకపోయాడు బారిక్ షాబర్ అనే వ్యక్తి. కోపంతో ఐదు గ్రామాలకు వెళ్లే రోడ్డును తవ్వి.. బండరాళ్లను అడ్డంగా పెట్టి రహదారిని నిర్బంధించాడు. వీధి దీపాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటన ఒడిశా గజపతి జిల్లాలోని గంగాబాడ పంచాయతీలో గురువారం జరిగింది.

digs on the road
రోడ్డుకు అడ్డుగా బండరాళ్లు

ఆంధ్రప్రదేశ్​ సరిహద్దులో గంగాబాడ పంచాయతీ ఉంది. ఇక్కడ మొత్తం 1500 మంది ఓటర్లు ఉన్నారు. గంగబాడ పంచాయతీలో గత 15 సంవత్సరాలుగా హరిబంధు కర్జీ లేదా అతని కుటుంబ సభ్యులే సర్పంచ్‌గా ఎన్నికవుతున్నారు.

road cut off
రహదారిని తవ్విన నిందితుడు

సర్పంచ్​గా ఓడిపోవడం వల్లే...

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా బారిక్ షాబర్​పై హరిబంధు కర్జీ ఘన విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ కోపంతోనే బారిక్ రహదారుల దిగ్బంధానికి పాల్పడ్డాడని కర్జీ ఆరోపించారు. ఈయన స్థానికులతో కలిసి గారబంధ పోలీస్ స్టేషన్‌లో బారిక్​పై ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి: మణిపుర్​ రెండో విడత పోలింగ్​ షురూ.. బరిలో 92 మంది అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.