అల్లోపతి వైద్యం, వైద్యులపై యోగా గురు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకు గానూ ఉత్తరాఖండ్ వైద్య సంఘం ఆయనపై రూ. వెయ్యి కోట్ల పరువునష్టం దావా వేసింది. 15 రోజుల్లోగా రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే రూ. వెయ్యికోట్లు కట్టాలని డిమాండ్ చేసింది.
రాందేవ్ బాబా.. అల్లోపతి వైద్య శాస్త్రం, వైద్యులను అవమానించేలా మాట్లాడారని భారత వైద్య సంఘం (ఐఎంఏ) ఆరోపించింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ తక్షణం స్పందించి ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమాల్లో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది ఐఎంఏ.
అయితే దీనిపై కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పందించారు. రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనిపై ఆయనకు లేఖ రాశారు. అనంతరం.. అల్లోపతి వైద్యంపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు రాందేవ్ పేర్కొన్నారు.
"బాబా రామ్‌దేవ్‌తో ముఖాముఖిగా మాట్లడడానికి నేను సిద్ధం. రామ్‌దేవ్‌కు అల్లోపతి గురించి పెద్దగా అవగాహన లేదు. అయినప్పటికీ అతను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అల్లోపతి వైద్యులపై ఆయన ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాందేవ్ వ్యాఖ్యలు కరోనాకు వ్యతిరేకంగా పగలు, రాత్రి పనిచేసే వైద్యుల మనోస్థైర్యాన్ని తగ్గించాయి. రామ్‌దేవ్ తన మందులను అమ్మేందుకు నిరంతరం అబద్ధం చెబుతున్నారు."
-అజయ్ ఖన్నా, భారత వైద్య సంఘం, ఉత్తరాఖండ్ అధ్యక్షులు
ఇదీ చదవండి: 'నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా'