ETV Bharat / bharat

మృత్యువుతో 702 రోజులు పోరాడి ఓడిన బాలిక.. చెట్టు కొమ్మ వల్లే... - bangalore prisha died

అధికారుల నిర్లక్ష్యం ఓ చిన్నారి నిండు ప్రాణాలను బలి తీసింది. ఎండిపోయిన చెట్ల కొమ్మలను తొలగించకపోవడం వల్ల ఆ చిన్నారిపై పెద్ద కొమ్మ పడి ఆస్పత్రిపాలు చేసింది. రెండేళ్లుగా చికిత్స పొందుతున్నా.. పరిస్థితి విషమించడం వల్ల మృతి చెందింది. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది.

prisha
చిన్నారి ప్రిశ
author img

By

Published : Feb 11, 2022, 1:14 PM IST

చెట్టు కొమ్మ మీదపడి, రెండేళ్లుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి గురువారం తుదిశ్వాస విడిచింది. ఆ పదేళ్ల బాలికకు 702 రోజులపాటు డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందించినా ఫలితం దక్కలేదు.

అసలు ఏం జరిగిందంటే?

2020 మార్చి 11వ తేదీన రేచల్​ ప్రిష తన తండ్రితో కలిసి బైక్​పై పాఠశాలకు వెళుతోంది. దారిలో ఓ ఎండిపోయిన చెట్టు కొమ్మ ప్రిష తలపై పడింది. గాయపడిన చిన్నారిని వెంటనే మణిపాల్​ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి దాదాపు రెండేళ్లు ప్రిష అక్కడే చికిత్స పొందింది.

ప్రిష నటుడు సుదీప్​కు అభిమాని. ఆమె గురించి తెలుసుకున్న సుదీప్.. ప్రిషతో కొద్దిరోజుల క్రితమే మాట్లాడారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే...

తమ పాప మృతికి కారణం బెంగుళూరు మహానగర పాలక సంస్థ అధికారులేనని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎండిపోయిన చెట్టు కొమ్మలను తొలగించడం అధికారుల బాధ్యత అని, పదే పదే ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం వల్ల ఈ దారుణం జరిగిందని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ఆసుపత్రికి వెళ్లి చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. రేచల్​ ప్రిష మృతి చెందటం చాలా బాధాకరమని, భవిష్యత్తులోనైనా బీబీఎంపీ అధికారులు ఇలాంటి విషాదాలు జరగకుండా చూడాలని ఆయన ట్వీట్​ చేశారు. ఇదే విషయంపై బెంగళూరు వాసులు కొందరు సామాజిక మాధ్యమాల వేదికగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: కన్నవారిని ఒప్పించలేక.. విడిచి బతకలేక.. ప్రేమ జంట ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.