ETV Bharat / bharat

మొబైల్​ గేమింగ్​కు బాలుడు బలి! - మొబైల్​ గేమ్​ ప్రమాదాలు

సరాదాగా ప్రారంభమైన మొబైల్​ గేమింగ్​.. అలవాటుగా మారింది. టైంపాస్​ కోసం మొదలెట్టిన ఆన్​లైన్​ ఆటలు.. సమయాన్నంతా లాగేశాయి. మొబైల్ గేమింగ్​కు బానిసై నిత్యం అందులో మునిగి తేలుతున్న ఓ విద్యార్థి.. చివరకు దానికే బలయ్యాడు. పుదుచ్చేరిలో ఈ ఘటన జరిగింది.

Death by gaming: Boy dies while playing game continuously on mobile incident happened in Puducherry
సరాదా మొబైల్​ గేమ్​కు బాలుడి ప్రాణం బలి!
author img

By

Published : Feb 3, 2021, 3:04 PM IST

కాలక్షేపం కోసమో లేక సరాదా కోసమో ప్రారంభించిన మొబైల్​ గేమింగ్​.. పుదుచ్చేరిలో ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆన్​లైన్​ గేమ్స్​కు బానిసైన ఓ ఇంటర్​ విద్యార్థి.. నిత్యం ఆటలాడుతూ.. వాటికి బానిసగా మారి.. చివరకు మృతిచెందాడు.

ఇదీ జరిగింది..

విల్లివయానూర్​లోని మానవేలికి చెందిన దర్శన్​(16).. గత కొద్ది రోజులుగా ఆన్​లైన్​ గేమ్​లకు అలవాటు పడ్డాడు. ఇటీవలి కాలంలో మరీ ఎక్కువగా మొబైల్​కు బానిసయ్యాడట దర్శన్​. ఎంతగా అంటే.. కనీసం టైంకు తిండి, నీరు కూడా తీసుకోలేనంతగా. ఇలా.. మంగళవారం రాత్రి ఏకధాటిగా నాలుగు గంటలపాటు ఆన్​లైన్​ గేమ్​(ఫైర్​ వాల్​) ఆడిన ఆ బాలుడు.. ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు.

Death by gaming: Boy dies while playing game continuously on mobile incident happened in Puducherry
దర్శన్​(ఫైల్​ ఫొటో)

అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమారుడు దర్శన్​ను చూసిన తండ్రి.. వెంటనే స్థానిక ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించాడు. అయితే.. అతణ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ బాలుడు మృతిచెందినట్టు నిర్ధరించారు.

ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మరణానికి కారణం ఏంటనేది శవపరీక్ష తర్వాతే తెలుస్తుందని వారు తెలిపారు.

ఇదీ చదవండి: కాళ్లు, చేతులు కట్టేసి వివాహితపై అత్యాచారం.. హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.