ETV Bharat / bharat

'నాకు ఇండియానే నచ్చింది'.. పోలీసులకు కృతజ్ఞతలు: బధిర యువతి గీత - సుష్మా స్వరాజ్​ గీత

భారత్​తో తప్పిపోయి పాక్​కు వెళ్లి.. అప్పటి కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్​ చొరవతో తిరిగి స్వదేశానికి చేరుకున్న మధ్యప్రదేశ్​కు చెందిన బధిర యువతి గీత ఎట్టకేలకు తన తల్లి దగ్గర ఆనందంగా జీవిస్తోంది. తాజాగా ఆమె తన కుటుంబసభ్యులతో భోపాల్ జీఆర్పీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చింది. ఎంతో చురుగ్గా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సైగల ద్వారా సమాధానాలిచ్చింది.

deaf-mute-geeta-thanks-grp-police-in-bhopal

author img

By

Published : Jul 9, 2022, 4:22 PM IST

Deaf Girl Geetha Thanks Police: గీత గుర్తుందా?.. మన దేశంలో తప్పిపోయి పాకిస్థాన్ చేరుకుని సుమారు 15 ఏళ్ల తర్వాత మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చిన బధిర యువతి. 2015లో అప్పటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చొరవతో.. తిరిగి ఆమె భారత్​కు చేరుకుంది. గీతను స్వదేశానికి రప్పించడానికి విశేష కృషి చేసి, తల్లిదండ్రుల ఒడికి చేర్చి ఆమెకు మరో బతుకునిచ్చారు సుష్మా స్వరాజ్. తాజాగా ఆమె తన కుటుంబ సభ్యులతో మధ్యప్రదేశ్​ భోపాల్​ జీఆర్పీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపేందుకు​ వచ్చింది. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపిన గీత.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సైగల ద్వారా సమాధానమిచ్చింది. పోలీసులు గీతను.. పాకిస్థాన్​ నచ్చిందా? ఇండియా నచ్చిందా? అక్కడ వారు ఎలా చూసుకున్నారు? శాకాహారం పెట్టారా? వారితో ఇంకా టచ్​లో ఉన్నావా? వంటి ప్రశ్నలు అడిగారు. వాటన్నంటికి ఎంతో చక్కగా గీత సైగల ద్వారా సమాధానాలు ఇచ్చింది.

"నేను భారత్​ను ఇష్టపడుతున్నాను. పాకిస్థాన్​లో నన్ను చాలా బాగా చూసుకున్నారు. అక్కడ ప్రజలు ఎక్కువగా మాంసాహరం తింటారు. కానీ నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ నాన్​వెజ్​ తినొద్దని చెప్పిన విషయం గుర్తుంది. అది వారికి చెప్పినందున వారు నాకు శాకాహారం పెట్టేవారు. పాక్​ నుంచి వచ్చాక కొన్నాళ్లు వారితో టచ్​లో ఉన్నాను."

-- గీత, బధిర యువతి(సైగలు ద్వారా)

ఎవరీ గీత?
బధిర యువతి గీత అసలు పేరు రాధ. 20 సంవత్సరాల క్రితం తప్పిపోయి పాకిస్థాన్​కు చేరుకుంది గీత. అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెను చేరదీసింది. 15 సంవత్సరాలు పాకిస్థాన్​లోని లాహోర్​లో ఉన్న ఆమె కట్టు, బొట్టు, ఆహార అలవాట్లు చూసి అక్కడున్న నిర్వాహకులు గీత అని పేరు పెట్టారు. ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో గీత ఫొటో చక్కర్లు కొట్టింది. దీంతో నాటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ చొరవ తీసుకొని 5 సంవత్సరాల క్రితం ఆమెను భారత్​కు తీసుకువచ్చారు. అనంతరం మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఆ తర్వాత ఆమె సైగలను అర్థం చేసుకుని తెలంగాణలోని బాసరకు తీసుకొచ్చారు. ఆ సమయంలోనే నలభై కుటుంబాలు.. తమ కుమార్తె అంటే తమ కుమార్తె అని ఎగబడ్డారు. కానీ అధికారులు ఎవరికీ అప్పగించలేదు. అనంతరం గీత అమ్మమ్మ తెలిపిన గుర్తులను నిర్ధరించుకున్న అధికారులు.. గతేడాది గీతను తన తల్లి చెంతకు చేర్చారు.

ఇవీ చదవండి: 'నేను దుర్గాదేవిని.. నా భర్తను వదలండి'.. మహిళ హైడ్రామా.. పోలీస్ స్టేషన్​లో చేతబడి!

ఇంట్లో తల్లి మృతదేహం.. గుడిలో యువతితో వివాహం... అసలు ఏమైందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.