గుజరాత్ సబర్మతీ నది నీటిలో కరోనా వైరస్! - కంకరియా సరస్సు
గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతీ నది సహా మరో రెండు సరస్సుల్లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు నిపుణులు. నాలుగు నెలలపాటు పలుమార్లు నీటి శాంపిళ్లను సేకరించి వైరస్ ఉనికిపై స్పష్టత ఇచ్చారు.
గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతీ నది, కంకరియా, ఛందోలా సరస్సుల్లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు కొందరు ఐఐటీ నిపుణులు. గాంధీనగర్ ఐఐటీ ప్రొఫెసర్ మనీష్ కుమార్ సహా 8 ఇతర సంస్థల నిపుణులు ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనాన్ని నివేదించింది ఐఐటీ గాంధీనగర్.
నాలుగు నెలల్లో ఐదు రోజులు..
సబర్మతీ నది నుంచి 18 సార్లు, కంకరియా, ఛందోలా సరస్సుల నుంచి 16 సార్లు నీటి శాంపిళ్లను సేకరించినట్లు మనీష్ తెలిపారు. నాలుగు నెలల్లో మొత్తంగా ఐదు రోజులు ఈ నీటి శాంపిళ్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు. అయితే.. నీటిలో గుర్తించిన ఈ వైరస్ ప్రాణాంతకం కాదని వెల్లిడించారు. అది 'డెడ్ వైరస్' అని స్పష్టం చేశారు.
ఈ వైరస్‌తో భయాందోళనకు గురికావొద్దని చెప్పినప్పటికీ.. ఈత కొలనులకు వెళ్లకపోవడం మంచిదని మనీష్ సూచించారు.
ఇదీ చదవండి:fungus: సూరత్‌లో ఐదు మ్యూకర్మైకోసిస్ వేరియంట్లు