కర్ణాటకలోని చిక్కమగళూరులో అధికారులు నిర్వహించిన ఏనుగులను చెదరగొట్టే క్యాంప్ మరుగుదొడ్డిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. అయితే ఈ ఘటన వెనుక అటవీశాఖ అధికారుల హస్తం ఉందని స్థానికులు అనుమానిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
చిక్కమగళూరులో ఏనుగులను తరిమికొట్టే క్యాంప్‌ను అటవీశాఖ అధికారులు నిర్వహించారు. అయితే గురువారం రాత్రి ఆ ప్రాంతానికి ఇద్దరు వ్యక్తులు గంధం చెక్కలు దొంగలించేందుకు వచ్చారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత రోజు క్యాంప్‌లోని మరుగుదొడ్డిలో ఓ మృతదేహం దొరకడం స్థానికుల్లో తీవ్ర ఆందోళన రేపింది.
అయితే బాధితుడి మృతికి పోలీసులే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అతడిది లాకప్‌డెత్ అయి ఉంటుందని, పోలీసులే మరుగుదొడ్డిలో మృతదేహాన్ని పడేసి ఉంటారని స్థానికులు అంటున్నారు. అయితే పోలీసులు.. ఈ ఘటనతో తమకు సంబంధం లేనట్లుగా దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా విషాదం.. ఊపిరి ఆడక ముగ్గురు కార్మికులు మృతి!
బెంగళూరు అతలాకుతలం.. చెరువులుగా మారిన రహదారులు.. అనేక ఇళ్లు ధ్వంసం