ETV Bharat / bharat

తప్పిపోయిన తల్లికి అంత్యక్రియలు.. మరుసటి రోజే ఇంటికి వచ్చిన 'ఆమె'ను చూసి! - తాంబరం రైల్వే ప్రమాదం

తల్లి రైలు ప్రమాదంలో చనిపోయిందనుకుని అంత్యక్రియలను నిర్వహించాడు ఆమె కుమారుడు. అయితే అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే తల్లి ఇంటికి రావడం వల్ల ఆనందంలో మునిగిపోయాడు. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోలీసులకు అప్పగించాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

Dead and buried woman
మృతదేహం
author img

By

Published : Sep 24, 2022, 7:48 PM IST

తప్పిపోయిన తన తల్లి రైలు ప్రమాదంలో చనిపోయిందని భావించాడు ఓ వ్యక్తి. రైల్వేస్టేషన్​లో గుర్తు తెలియని మృతదేహం కనిపించడం వల్ల తన తల్లిదేనని భావించాడు. ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలను సైతం నిర్వహించాడు. అనంతరం ఒక రోజు తర్వాత ఆయన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

అసలేం జరిగిందంటే.. చెంగల్పట్టులోని గుడువంచెరుకి చెందిన వడివేలు తల్లి చంద్ర(72).. సెప్టెంబరు 20న గుడికి వెళ్లింది. అనంతరం ఆమె ఇంటికి రాలేదు. తల్లి ఆచూకీ కోసం కుమారుడు వడివేలు ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో ఆయన చాలా బాధపడ్డాడు. ఇంతలో తాంబరం రైలు పట్టాలపై ఓ వృద్ధురాలు మృతదేహం పడి ఉందని వడివేలుకు తెలిసింది. రైలు ప్రమాదంలో చనిపోయింది తన తల్లే అనుకున్నాడు వడివేలు. మృతురాలు ఫొటో కూడా చంద్రకు సరిపోలినట్లు ఉండడం వల్ల తన తల్లి మృతి చెందిందని భావించాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించాడు వడివేలు.

అయితే ఇక్కడే ఓ ట్విస్ట్​.. మరుసటి రోజే వడివేలు తల్లి చంద్ర(72) ఇంటికి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అతడు తల్లిని చూసి ఆనందపడ్డాడు. వెంటనే తన తల్లి మృతదేహం అనుకుని తీసుకొచ్చిన వేరొక మహిళ మృతదేహాన్ని పాతిపెట్టిన విషయం తాంబరం పోలీసులకు తెలిపాడు. ఎమ్మార్వో సమక్షంలో వృద్ధురాలి మృతదేహాన్ని వెలికితీసి.. క్రోంపేట ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు పోలీసులు. మృతురాలు చెన్నైలోని త్రిశూలం ప్రాంతానికి చెందిన పద్మ అని పోలీసుల విచారణలో తేలింది. వృద్ధురాలి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు.

ఇవీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు శశిథరూర్ రెడీ.. సెప్టెంబరు 30న నామినేషన్!

మైనర్​పై వలస కూలీలు గ్యాంగ్​రేప్.. రైల్వే ట్రాక్​ దగ్గర వదిలి పరార్​.. కోడలిని చంపిన మామ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.