ETV Bharat / bharat

కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ డోసుల మిక్సింగ్​పై ప్రయోగాలు

కరోనాకు ఇచ్చే టీకా డోసులు మిశ్రమంపై ప్రయోగాలు చేసేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ అంగీకారం తెలిపింది. ఈ ప్రయోగాలు నిర్వహించడానికి అనుమతులు ఇవ్వాలని ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

MIXING COVAXIN AND COVISHIELD
మిశ్రమంపై ప్రయోగాలు
author img

By

Published : Aug 11, 2021, 10:36 AM IST

కొవిడ్‌-19 నివారణకు వాడే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా డోసుల మిశ్రమంపై దేశంలో ప్రయోగాలు నిర్వహించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) పచ్చజెండా ఊపింది. వెల్లూర్‌లోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసీ)లో ఈ అధ్యయనం, క్లినికల్‌ ప్రయోగాలు జరుగుతాయి. ఈ ప్రయోగాలు నిర్వహించడానికి అనుమతించాలని గత నెలలో ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో)లోని నిపుణుల బృందం సిఫార్సు చేసింది.

ఇందులో భాగంగా.. ఆరోగ్యంగా ఉన్న 300 మంది వాలంటీర్లపై నాలుగో దశ క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహిస్తారు. వీరికి ఒక డోసు కింద కొవాగ్జిన్‌ను, మరో డోసుగా కొవిషీల్డ్‌ను ఇచ్చి పరీక్షిస్తారు. ఒక వ్యక్తికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయడానికి రెండు భిన్న కంపెనీల టీకా డోసులను ఇవ్వవచ్చా అన్నది పరిశీలించడం దీని ఉద్దేశం.

ఉత్తర్‌ ప్రదేశ్‌లో పొరపాటున కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకా డోసుల మిశ్రమాన్ని పొందిన వారిపై ఇటీవల భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనం జరిపిన విషయం తెలిసిందే. మిశ్రమ డోసుల వల్ల కరోనా నుంచి మరింత మెరుగైన రక్షణ లభిస్తుందని అందులో వెల్లడైంది. కొవాగ్జిన్‌.. ఇన్‌యాక్టివేటెడ్‌ హోల్‌ వైరియాన్‌ టీకా కాగా.. కొవిషీల్డ్‌ను మాత్రం అడినోవైరస్‌ను వాహకంగా ఉపయోగిస్తూ రూపొందించారు.

ఇదీ చూడండి: మళ్లీ పెరిగిన కేసులు- కొత్తగా 38వేల మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.