ETV Bharat / bharat

పిల్లల కరోనా టీకాకు డీసీజీఐ ఫైనల్ అప్రూవల్ - కార్బీవ్యాక్స్​ టీకాకు అనుమతులు

Children corona vaccine: 12 నుంచి 18 సంవత్సరాల పిల్లల కోసం 'బయోలాజికల్-ఇ' రూపొందించిన కరోనా టీకా కార్బీవ్యాక్స్​కు భారత ఔషధ నియంత్రణా సంస్థ తుది అనుమతులు ఇచ్చింది.

Corbevax
Corbevax
author img

By

Published : Feb 21, 2022, 6:29 PM IST

Updated : Feb 21, 2022, 6:41 PM IST

Children corona vaccine: 12-18 ఏళ్ల పిల్లలకు మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. బయోలాజికల్​-ఇ సంస్థకు చెందిన కార్బీవాక్స్ వ్యాక్సిన్​ వినియోగానికి డ్రగ్స్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా తుది అనుమతులు ఇచ్చింది. గత వారంలో నిపుణుల కమిటీ సిఫార్సు చేయగా.. డీసీజీఐ ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 12-18 ఏళ్ల పిల్లలకు అందుబాటులోకి వచ్చిన రెండో టీకాగా కార్బీవ్యాక్స్​ నిలిచింది. రెండు డోసుల కింద ఈ వ్యాక్సిన్​ను పంపిణీ చేయనున్నారు. ఈ టీకా ధర రూ.145 (పన్నులు కాకుండా) ఉండొచ్చని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

12 ఏళ్లలోపు పిల్లలకు కూడా బయోలాజికల్-ఇ టీకాలను రూపొందించనుంది. ఇందుకోసం క్లినికల్​ ట్రయల్స్​కు అవసరమయ్యే డేటాను కూడా త్వరలోనే డీసీజీఐకి సమర్పించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చూడండి: కడుపులో చాయ్​ గ్లాస్​.. ఎలా మింగేశాడంటే..?

Last Updated : Feb 21, 2022, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.