ETV Bharat / bharat

కరోనాను అరికట్టేందుకు 'కొవిషీల్డ్​'కు గ్రీన్​ సిగ్నల్​!

author img

By

Published : Jan 2, 2021, 5:03 AM IST

దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ముందడుగు పడింది. ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ. ఈ మేరకు టీకాకు షరతులతో కూడిన వినియోగానికి అనుమతి ఇవ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది నిపుణుల బృందం.

DCGI EXPERTS HAVE RECOMMENDED TO COVISHIELD VACCINE FOR EMERGENCY USE
టీకాకు ఓకే!

భారత్‌లో కొవిడ్‌-19 నిర్మూలనకు సమర శంఖం మోగింది. దేశంలో ఈ మహమ్మారిని తుదముట్టించే టీకా కార్యక్రమానికి ముందడుగు పడింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ సౌజన్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో) ఆధ్వర్యంలోని నిపుణుల బృందం పచ్చజెండా ఊపింది. శుక్రవారం ఇక్కడ సమావేశమైన ఈ బృందం.. ఈ టీకాకు షరతులతో కూడిన వినియోగానికి అనుమతివ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది.

కొవిషీల్డ్‌తో పాటు భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగం కోసం దాఖలైన దరఖాస్తులపై డిసెంబరు 9, 30 తేదీల్లో నిపుణుల కమిటీ చర్చించింది. మూడోదశ క్లినికల్‌ ప్రయోగాలపై మధ్యంతర ఫలితాలను సమర్పించాలని భారత్‌ బయోటెక్‌ను, బ్రిటన్‌ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను అందించాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ను గతంలో కోరింది. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన టీకాకు బ్రిటన్‌ ప్రభుత్వం డిసెంబరు 30న అనుమతులు ఇచ్చింది. అదే సమాచారాన్ని సీరం సంస్థ.. నిపుణుల కమిటీకి సమర్పించడంతో దాని అత్యవసర వినియోగ అనుమతులకు మార్గం సుగమమైంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ కమిటీ విస్తృతంగా చర్చించింది. అనంతరం అనుమతులకు సిఫార్సు చేసింది.

కొవాగ్జిన్​పై పరిశీలన..

మరోవైపు భారత్‌ బయోటెక్‌ దరఖాస్తుపైనా పరిశీలించింది. 25,800 మంది వాలంటీర్లతో ఈ సంస్థ ప్రస్తుతం చేపట్టిన క్లినికల్‌ ప్రయోగం అతిపెద్దదని పేర్కొంది. వీరిలో 22వేల మంది ఎంపిక పూర్తయిందని తెలిపింది. వీరిలో ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారినీ ఎంచుకున్నారని వివరించింది. ఈ టీకా భద్రత ఇప్పటికే రుజువైందని తెలిపింది. అయితే దాని సమర్థత ఇంకా వెల్లడి కావాల్సి ఉందని పేర్కొంది. "ఈ నేపథ్యంలో సవివర చర్చల అనంతరం భారత్‌ బయోటెక్‌కు కొన్ని సూచనలు చేస్తున్నాం. కొవాగ్జిన్‌పై ప్రస్తుతం సాగుతున్న క్లినికల్‌ ప్రయోగాల్లో వాలంటీర్ల ఎంపికను వేగవంతం చేయాలి. ఆ టీకా సమర్థతపై మధ్యంతర విశ్లేషణను నిర్వహించాలి. వాటి ఆధారంగా ఈ వ్యాక్సిన్‌కు కూడా అత్యవసర వినియోగ అనుమతినిచ్చే అంశాన్ని పరిశీలిస్తాం" అని నిపుణుల కమిటీ తెలిపింది. మరో సంస్థ ఫైజర్‌ సమర్పించిన దరఖాస్తుపై తాజా భేటీలో చర్చించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కొవిషీల్డ్‌ అత్యవసర వినియోగానికి అనుమతులిస్తూ కొన్ని షరతులను నిపుణుల కమిటీ విధించింది.

  • ‌18 ఏళ్లు, అంత కన్నా ఎక్కువ వయసున్నవారికి మాత్రమే ఆ టీకా ఇవ్వాలి.
  • ‌ఇంజెక్షన్‌ రూపంలో కండరాల్లోకి దీన్ని ఎక్కించాలి. 4-6 వారాల విరామంతో రెండు డోసుల్లో దీన్ని ఇవ్వాలి.
  • ‌దేశవ్యాప్తంగా, పలు దేశాల్లో ఈ టీకాపై కొనసాగుతున్న క్లినికల్‌ ప్రయోగాల్లో భద్రత, సమర్థత, రోగనిరోధక సామర్థ్యానికి సంబంధించిన డేటాను త్వరగా సమర్పించాలి.
  • ‌టీకాలు వేశాక దుష్ప్రభావాలపై సవివర నివేదికను సమర్పించాలి. మొదటి రెండు నెలల్లో 15 రోజుల కోసారి ఈ వివరాలను ఇవ్వాలి. ఆ తర్వాత నెలకోసారి సమర్పించాలి. దేశంలో ఈ టీకాపై జరుగుతున్న క్లినికల్‌ ప్రయోగాలు ముగిసేవరకూ ఇవి తప్పనిసరి.

తర్వాత ప్రక్రియ ఏంటి?

కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదించిన నిపుణుల బృందం ఈ సమావేశంలో చర్చించిన అంశాలను భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు పంపుతుంది. వీటికి డీసీజీఐ ఆమోదముద్ర వేసి అనుమతుల పత్రాన్ని జారీచేస్తుంది. అనంతరం సంబంధిత సంస్థ.. మార్కెట్‌ ఆథరైజేషన్‌, ఉత్పత్తికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యాకే మార్కెట్‌లోకి టీకాను తీసుకురావడానికి వీలవుతుంది.

అత్యవసర వినియోగ అనుమతి అంటే..

రోగికి ప్రత్యామ్నాయ చికిత్సలేవీ అందుబాటులో లేవన్నప్పుడు మాత్రమే కొన్ని టీకాలను అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇస్తారు. ఆ వ్యాక్సిన్‌ ఇచ్చే ముందు ప్రతి రోగి నుంచి ముందస్తు అనుమతి పత్రం తీసుకోవాలి. ఆ టీకా వల్ల తలెత్తే అవకాశమున్న దుష్ప్రభావాల గురించి రోగికి, వారి కుటుంబ సభ్యులకు ముందే చెప్పాలి. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తికాక ముందే మధ్యంతర ఫలితాల ఆధారంగా అనుమతులు ఇస్తున్నందున ఈ షరతులు విధిస్తారు.

ప్రభుత్వం నిర్ణయించిన ప్రాధాన్య క్రమంలో కోటి మంది వైద్య సిబ్బంది, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, 50 ఏళ్లపైబడిన 27 కోట్ల మందికి తొలిదశలో టీకా అందిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టీకాను నేరుగా మార్కెట్‌లోకి తెస్తే నల్ల బజారుకు తరలే అవకాశం ఉన్నందున ప్రభుత్వ సంస్థల ద్వారానే దీన్ని అందించాలన్న షరతు విధించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

త్వరలోనే కొవాగ్జిన్‌కూ...

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన పూర్తి స్వదేశీ టీకా కొవాగ్జిన్‌కు అతి త్వరలో అనుమతులు లభిస్తాయని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. తొలి రెండు దశల ప్రయోగాల్లో అది ఆశాజనక ఫలితాలు ఇచ్చినట్లు చెప్పారు. "భారత్‌ బయోటెక్‌ టీకా దాదాపు తుది దశకు వచ్చింది. మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలను చాలా వరకు పూర్తిచేసింది. వ్యాక్సిన్‌ తయారీకి ప్రామాణిక పద్ధతులు పాటించింది. నిజమైన భారత టీకా కాబట్టి అది మనకు కొండంత బలం. ఇదివరకు వ్యాక్సిన్లనూ ఆ సంస్థ బాగా అభివృద్ధి చేసింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ కొత్తగా ఎం-ఆర్‌ఎన్‌ఏ విధానంలో చేశారు. రెడ్డీస్‌ ల్యాబ్స్‌ అభివృద్ధి చేస్తున్న రష్యా టీకా కూడా వస్తుంది. వచ్చే కొన్ని వారాల్లో అధిక సంఖ్యలో టీకాలు అందుబాటులోకి వస్తాయి. సరిపడినన్ని డోసులను అందించడం సులభం అవుతుంది." అని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: 'నేను జ్యోతిష్కుడిని కాను.. కానీ సానుకూల ఫలితాలు రావచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.