దేవీ నవరాత్రి ఉత్సవాలను (Navratri Celebration) ఒక్కోచోట ఒక్కోలా జరుపుకుంటారు. చాలా మంది భక్తులు తమ ఇళ్లలో బొమ్మలను పెట్టి దసరా వేడుకలను (Dasara Festival) నిర్వహిస్తారు. కర్ణాటకలో ఓ దంపతులు మాత్రం 31 దేశాలకు చెందిన బొమ్మలను (Dasara Dolls) ప్రదర్శించడం విశేషం. వాటిల్లో ప్రసిద్ధ చెన్నపట్టణం దైవ ప్రతిమలు సహా మైసూర్ బొమ్మలు కూడా ఉన్నాయి.
![dasara doll festival in karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-dvg-04-11-foreign-gombe-spl-pkg-7204336_11102021142807_1110f_1633942687_74_1110newsroom_1633961852_183.png)
దావణగెరెలో నివాసముంటున్న మురుగేంద్రప్ప, సుమంగళ దంపతులు.. 21 ఏళ్ల పాటు నైజీరియాలో ఉన్నారు. ఆ దేశ ప్రత్యేకతను చాటిచెప్పే ఎన్నో బొమ్మలను ఆ సమయంలో వారు సేకరించారు (Dolls Collection).
"ఆఫ్రికా దేశాలు సహజంగానే సంపన్నమైనవి. హస్త కళ.. అక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం. నేను నైజీరియాకు 1991లో వెళ్లాను. ఆ దేశ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి నాకు రెండేళ్లు పట్టింది. నైజీరియా మొత్తం చుట్టేశాను. అక్కడి బొమ్మలు, కళాకృతులను కొంటూ ఉండేవాడిని."
-మురుగేంద్రప్ప
![dasara doll festival in karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-dvg-04-11-foreign-gombe-spl-pkg-7204336_11102021142807_1110f_1633942687_575_1110newsroom_1633961852_339.png)
మురుగేంద్రప్ప.. టెక్స్టైల్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. వృత్తిరీత్యా.. అమెరికా, ఘనా, కెన్యా, శ్రీలంక, ఫ్రాన్స్, జర్మనీ, లిబియా, ఉత్తర కొరియా, వియత్నాం, కాంబోడియా సహా పలు దేశాలకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడి బొమ్మలు, కళాఖండాలను సేకరించారు (Dolls Collection).
![dasara doll festival in karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-dvg-04-11-foreign-gombe-spl-pkg-7204336_11102021142807_1110f_1633942687_442_1110newsroom_1633961852_797.png)
"దసరా సందర్భంగా మా బామ్మ తన ఇంట్లో బొమ్మలను ప్రదర్శనకు పెట్టేది. నాకూ చిన్నప్పటి నుంచే బొమ్మలను సేకరించే అలవాటు ఉంది. దీంతో ఎక్కడికి వెళ్లినా అక్కడి బొమ్మలను ఇంటికి తెస్తుంటా."
- సుమంగళ
దసరా సందర్భంగా ఈ బొమ్మలను (Dasara Dolls) తమ ఇంట్లో ప్రదర్శనకు పెట్టారు మురుగేంద్రప్ప దంపతులు. దీంతో వారి ఇల్లు చిన్న సైజు మ్యూజియాన్ని తలపిస్తోంది.
ఇదీ చూడండి: 'వెన్న తింటున్న కృష్ణుడి బొమ్మ'... కేరాఫ్ ముస్లిం మహిళ