ETV Bharat / bharat

భారత్‌కు దలైలామా ఆర్థిక సాయం

కరోనా విపత్కర పరిస్థితుల్లో భారత్​కు ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు టిబెట్​ బౌద్ధగురువు దలైలామా. తన ట్రస్ట్‌ ద్వారా భారత ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు టెక్​ కంపెనీ వివో.. ఆక్సిజన్‌ సరఫరా కోసం రూ.2కోట్ల విరాళం ప్రకటించింది.

Dalai lama
దలైలామా
author img

By

Published : Apr 28, 2021, 6:37 AM IST

కరోనా పోరులో భారత్‌కు అంతర్జాతీయ దేశాలు అండగా నిలుస్తున్నాయి. తాజాగా టిబెట్‌ బౌద్ధగురువు దలైలామా కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తన ట్రస్ట్‌ ద్వారా భారత ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

"భారత్‌ సహా ప్రపంచమంతా కొవిడ్‌ మహమ్మారితో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో భారత సోదర, సోదరీమణులకు అండగా ఉండేందుకు పీఎం-కేర్స్‌ ఫండ్‌కు విరాళం ఇవ్వాలని దలైలామా ట్రస్ట్‌ను కోరాను. మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాల సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అభినందనలు. కొవిడ్‌ ముప్పు త్వరలోనే తొలగిపోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా."

- దలైలామా, టిబెట్‌ బౌద్ధగురువు

వివో రూ.2 కోట్ల సాయం..

కరోనాపై పోరులో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండేందుకు టెక్‌ కంపెనీలు కూడా ముందుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ వివో ఇండియా.. ఆక్సిజన్‌ సరఫరా నిమిత్తం రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది. కరోనా తొలి దశలోనూ వివో తన వంతు సహకారం అందించింది. అప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు 9 లక్షల మాస్క్‌లు, 15,000 పీపీఈ కిట్లు, 50వేల లీటర్ల శానిటైజర్లను వితరణగా అందించింది.

ఇదీ చూడండి: 'రైళ్లలో 64 వేల కొవిడ్ పడకలు సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.