ETV Bharat / bharat

DA Hike For Railway Employees : రైల్వే ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. 4 శాతం DA పెంచిన కేంద్రం - railway employees da 2023

DA Hike For Railway Employees : రైల్వే ఉద్యోగులకు గుడ్​న్యూస్​ చెప్పింది భారతీయ రైల్వే. ఇండియన్​ రైల్వేస్​లో పనిచేస్తున్న ఉద్యోగులకు 4% డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Railway Board Announces 4% Hike In Dearness Allowance For Employees
DA Hike For Railway Employees
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 12:23 PM IST

Updated : Oct 24, 2023, 1:28 PM IST

DA Hike For Railway Employees : దీపావళి పండగ సందర్భంగా భారతీయ రైల్వే తమ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. రైల్వేలో పనిచేస్తున్న వారికి 4% డియర్‌నెస్ అలవెన్స్‌(డీఏ)ను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఈ డీఏ 2023, జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. తాజా పెంపుతో ప్రస్తుతం 42 శాతంగా ఉన్న డీఏ 46 శాతానికి పెరిగింది. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన ఐదు రోజుల తర్వాత ఈ డీఏ పెంపు ప్రకటన వెలువడింది. ఈ మేరకు రైల్వే బోర్డు జనరల్ మేనేజర్‌, ఆల్ ఇండియా రైల్వేస్ అండ్​ ప్రొడక్షన్ యూనిట్‌ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌లకు అక్టోబర్​ 23న ఉత్తర్వులను జారీ చేసింది కేంద్రం.

ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల నుంచి ఉద్యోగులను రక్షించడమే లక్ష్యంగా వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను పెంచిందని రైల్వే ఉద్యోగుల సంఘం నేతలు చెబుతున్నారు. ఇక ఈ తాజా ఉత్తర్వులతో రైల్వే ఉద్యోగులు తదుపరి నెల(నవంబర్​)లో వచ్చే వేతనంలో ఈ డీఏను(జులై నుంచి) పొందనున్నారు.

"4 శాతం పెరిగిన డీఏ 2023 జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం బేసిక్​ పేలో 42 శాతంగా ఉన్న DA 46 శాతానికి పెరిగినట్లయింది. వీరికి చెల్లించాల్సిన డియర్‌నెస్ అలవెన్స్​ను రానున్న నెలలో చెల్లిస్తాము. దీపావళి పండుగ సందర్భంగా ఈ డీఏ పెంపు నిర్ణయాన్ని రైల్వే యూనియన్లు స్వాగతించాయి. ప్రభుత్వం ఆమోదించిన 7వ సీపీసీ సిఫార్సు ప్రకారం డ్రా చేసుకునే వేతనాన్ని బేసిక్​ పేగా వివరించింది."

- రైల్వే బోర్డు జనరల్ మేనేజర్‌

రైల్వే ఉద్యోగులకు బోనస్​ బొనాంజ!
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా శుభవార్త చెప్పింది. ప్రతి ఏటా రెండు సార్లు పెంచే డియర్‌నెస్ అలవెన్స్‌ (డీఏ), డియర్‌నెస్‌ రిలీఫ్ (డీఆర్)ను 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన నగదును బోనస్‌ కింద అందించేందుకు కూడా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల 48.67 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పింఛన్‌దారులకు లబ్ధి చేకూరనుంది. ఇక దీంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.12,857 కోట్ల అదనపు భారం పడనుందని కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్ చెప్పారు.

7th Pay Commission News : రైల్వే ఉద్యోగులకు పండగ.. భారీగా బోనస్ ప్రకటించిన కేంద్రం!

7th Pay Commission Announced DA Hike Date : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ.. దసరా బొనాంజా..?

DA Hike News : ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ 4 శాతం పెంపు.. రైల్వే ఎంప్లాయిస్​కు 78 రోజుల బోనస్​

Last Updated : Oct 24, 2023, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.