ETV Bharat / bharat

డీమార్ట్ లాభాల్లో 52 శాతం వృద్ధి​ - డీమార్ట్‌ లాభాలు

దేశంలోనే అతిపెద్ద రిటైల్ దిగ్గజం డీమార్ట్‌ మాతృ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ నాలుగో త్రైమాసిక ఫలితాల్లో ఆకర్షణీయ లాభాలను ప్రకటించింది. మార్చ్​తో ముగిసిన త్రైమాసికంలో 52.56 శాతం పెరుగుదలతో.. రూ.413.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు తెలిపింది.

D-Mart
డీమార్ట్
author img

By

Published : May 8, 2021, 5:54 PM IST

డీమార్ట్‌ పేరిట రిటైల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ నాలుగో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. నికర లాభం 52.6 శాతం పెరిగి.. రూ.413.9 కోట్లకు చేరుకుందని తెలిపింది. ఇక 2021 జనవరి-మార్చి మధ్య.. ఆదాయం 18.47 శాతం పెరిగి రూ.7,411.68 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఇది రూ.6,255.93 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.271.28 కోట్లుగా ఉన్నట్లు బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో సంస్థ పేర్కొంది.

డీ-మార్ట్ లాభాలు..

  • ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ 2.92 శాతం తగ్గి.. రూ.24,143.06 కోట్లకు చేరుకుంది. ఇది 2019-20లో రూ .24,870.20 కోట్లుగా ఉంది.
  • స్టాండ్​అలోన్​ ఆధారిత కార్యకలాపాల్లో కంపెనీ నికర లాభం 51.62 శాతం వృద్ధితో రూ.434.95 కోట్లకు చేరింది.
  • ఈ త్రైమాసికంలో ఆదాయం 17.92 శాతం పెరిగి.. రూ 7,303.13 కోట్లకు చేరింది. గతేడాది ఇది 6,193.53 కోట్లుగా ఉంది.
  • మొత్తంగా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ నికర లాభం 15.5 శాతం తగ్గి.. రూ.1,099.43 కోట్లకు చేరుకుంది. అంతకుముందు సంవత్సరంలో ఇది రూ.1,300.98 కోట్లుగా ఉంది.

"కరోనా కారణంగా విధించిన కఠినమైన లాక్‌డౌన్ వల్ల డీ-మార్ట్ వ్యాపారం సవాలుగా ఉంది. అయితే 2020-21లో.. వడ్డీలు, రుణభారం తగ్గాయి."

-నివెల్లీ నోరోన్హా, అవెన్యూ సూపర్‌మార్ట్స్ సీఈఓ, ఎండీ

ఇవీ చదవండి: డీమార్ట్​ అధిపతికి రూ.1000 కోట్ల ఇల్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.