గులాబ్ తుపాను(gulab cyclone) పశ్చిమ దిశగా కదులుతోందని, వచ్చే 12 గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది(imd weather forecast). ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
![Cyclonic 'Gulab'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-kpt-02-cyclone-landslide-pht-7202788_27092021092249_2709f_1632714769_465_2709newsroom_1632721652_211.jpg)
"దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలో 27 సెప్టెంబర్ ఉదయ 5.30 గంటలకు గులాబ్ కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం పశ్చిమ దిశగా కదులుతోంది. వచ్చే 12 గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. "
- ఐఎండీ.
అంతకు ముందు ఆదివారం రాత్రి ఒడిశాలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ దిశగా కదులుతూ సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు తుపాను నుంచి తీవ్ర వాయుగుండంగా మారినట్లు తెలిపింది.
![Cyclonic 'Gulab'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-kpt-02-cyclone-landslide-pht-7202788_27092021092249_2709f_1632714769_1021_2709newsroom_1632721652_998.jpg)
ఒడిశాలో భారీ వర్షాలు..
తుపాను తీరం దాటిన నేపథ్యంలో.. ఒడిశాలోని కోరాపుట్, రాయిగడ, గజపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిస్తున్నాయి. 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పెను గాలులకు పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి.
![Cyclonic 'Gulab'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-kpt-02-cyclone-landslide-pht-7202788_27092021092249_2709f_1632714769_300_2709newsroom_1632721652_632.jpg)
![Cyclonic 'Gulab'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-kpt-02-cyclone-landslide-pht-7202788_27092021092249_2709f_1632714769_228_2709newsroom_1632721652_717.jpg)
![Cyclonic 'Gulab'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-kpt-02-cyclone-landslide-pht-7202788_27092021092249_2709f_1632714769_197_2709newsroom_1632721652_866.jpg)
ఇదీ చూడండి: తీరం దాటిన 'గులాబ్'- ఒడిశాలో అతి భారీ వర్షాలు!