ETV Bharat / bharat

ఒడిశా, బంగాల్​ రాష్ట్రాల్లో 'యాస్​' బీభత్సం

ఒడిశా, బంగాల్‌పై యాస్‌ తుపాను పంజా విసిరింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒడిశాలోని బాలేశ్వర్​కు సమీపంలో తీరం దాటిన తుపాను బీభత్సం సృష్టించింది. ఒడిశాలో ముగ్గురు, బంగాల్​లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. భీకర గాలులు, జోరు వానలకు ఊళ్లు, ఏర్లు ఏకమయ్యాయి. సముద్రం పొటెత్తి నివాస ప్రాంతాలను ముంచెత్తింది. బంగాల్‌లో కోటి మందిపై తుపాను ప్రభావం చూపిందని, 3 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయని, ఒకరు చనిపోయారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

yaas cyclone in bengal, యాస్​ తుపాను
ఒడిశా, బంగాల్​ రాష్ట్రాల్లో 'యాస్​' బీభత్సం
author img

By

Published : May 26, 2021, 6:13 PM IST

Updated : May 26, 2021, 8:05 PM IST

యాస్​ తుపాను ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలో ముగ్గురు, బంగాల్​లో ఒకరు మృత్యువాత పడ్డట్టు అధికారులు వెల్లడించారు. రెండు రాష్ట్రాల నుంచి 20లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.

ఒడిశాలో తీరం దాటింది..

బుధవారం ఉదయం 9 గంటలకు ఒడిశాలోని దమ్రా వద్ద తీరాన్ని తాకిన తుపాను మధ్యాహ్నం ఒకటిన్నరకు తీరం దాటింది. బాలేశ్వర్​కు 50 కిలోమీటర్ల దూరంలో తీరం దాటినట్లు వాతావరణ విభాగం తెలిపింది. తీరాన్ని తాకే సమయంలో ఒడిశా, బెంగాల్ తీర ప్రాంత జిల్లాలపై తుపాను.. తీవ్ర ప్రభావం చూపింది. భీకర గాలులు, భారీ వర్షాలకు.. పలు ప్రాంతాలు వణికిపోయాయి. గంటకు 130 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలులు ఒడిశాలోని భద్రక్ జిల్లాను అతలాకుతలం చేశాయి.

yaas cyclone in bengal, యాస్​ తుపాను
ఒడిశా, బంగాల్​ రాష్ట్రాల్లో యాస్​ తూపాను బీభత్సం

జిల్లాలోని ధమ్రా, పారాదీప్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. చాందీపూర్, బాలేశ్వర్ ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున గాలులతో కూడిన వర్షం పడింది. ప్రచండ గాలుల ధాటికి ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డాయి. పలుచోట్ల భారీ చెట్లు సైతం నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోగా.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

yaas cyclone in bengal, యాస్​ తుపాను
తుపానుకు జలమయం

బాలేశ్వర్ జిల్లా బహనాగ, రేమున ప్రాంతాల్లో సముద్రం ముందుకు దూసుకొచ్చి సమీపంలోని ఇళ్లను ముంచెత్తింది. స్థానికుల సాయంతో గ్రామాల్లోకి వచ్చిన సముద్రపు నీటిని తోడివేసేందుకు.. అధికారులు చర్యలు చేపట్టారు. మయూర్‌బంగ్‌ జిల్లా బుధబలాంగ్‌ నదికి వరద పోటెత్తింది. ప్రమాద స్థాయి కంటే 21 మీటర్ల ఎత్తున వరద పోటెత్తగా.. సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జగత్‌సింగ్‌పూర్‌, కేంద్రపార, జాజ్‌పూర్‌ జిల్లాల్లో గాలులు, వర్షాల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

భద్రక్‌ జిల్లా చంద్‌బలి ప్రాంతంలో అత్యధికంగా 27.3 సెంటీమీటర్లు.. పారాదీప్‌లో 19.7 సెంటీ మీటర్లు వర్షపాతం రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు. తుపాను కారణంగా ఒడిశాలో పెద్దగా ఆస్తి నష్టం సంభవించలేదని అంచనా వేస్తున్నారు.

బంగాల్​లో బీభత్సం..

బంగాల్​లోనూ యాస్ తుపాను బీభత్సం సృష్టించింది. బాలేశ్వర్​తో సరిహద్దు కలిగి ఉన్న తూర్పు మెదినిపుర్ జిల్లా దిఘా వద్ద.. తుపాను తీవ్ర ప్రభావం చూపింది. సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ తీరం వెంబడి ఉన్న రోడ్డుపైకి పోటెత్తాయి. తూర్పు మిడ్నాపూర్‌, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో జోరు వానలకు రహదారులు చెరువులను తలపించాయి. ఇంటిపై కప్పులు, రేకులు ఎగిరిపోగా.. కొన్నిచోట్ల కార్లు వరదకు కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో సముద్రపు నీరు ఇళ్లలోకి ప్రవేశించగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తుపాను ధాటికి దక్షిణ 24 పరగణాల జిల్లాలో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాల ధాటికి కపిల్ ముని మందిరం నీట మునిగింది.

కోల్‌కతాలోనూ జోరు వానలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హావ్‌డా జిల్లాలో కూడా తుపాను ప్రభావం ఎక్కువగా ఉండగా.. పురులియా, నదియా, ముర్షిదాబాద్‌, తూర్పు బర్ధమాన్, ఉత్తర 24 పరగణాలు, డార్జీలింగ్‌ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఆయా ప్రాంతాల్లో ఎన్​డీఆర్​ఎఫ్​ సహాయ చర్యలు చేపట్టగా.. సైన్యానికి చెందిన 17 బృందాలు కూడా సాయం చేస్తున్నాయి.

తుపాను పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బంగాల్‌లోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు వివరించారు. తుపాను ప్రభావం తమ రాష్ట్రంపైనే ఎక్కువగా ఉందన్నారు. కోటిమందికిపైగా తుపాను వల్ల ప్రభావితమయ్యారని, ప్రాథమిక సమాచారం మేరకు 3 లక్షలకుపైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయని వెల్లడించారు.

సురక్షిత ప్రాంతాలకు..

తుపాను తీవ్రతను దృష్టిలో పెట్టుకొని.. ఒడిశాలో 5లక్షల 80వేల మందిని, బంగాల్‌లో 15లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెండు రాష్ట్రాల్లో ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు పెద్దఎత్తున సహాయ చర్యలు చేపట్టాయి. రహదారులపై విరిగిపడిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలను తొలగిస్తున్నారు. చాలాచోట్ల సైన్యం కూడా ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలతో కలిసి సహాయ చర్యల్లో పాల్గొంది. మరోవైపు తుపాను తీవ్రత తగ్గించుకొని ఝార్ఖండ్‌వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం వర సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగానే ఉంటాయని పేర్కొంది.

ఇదీ చదవండి : యాస్​ తుపాను: పొంచి ఉన్న 'పున్నమి' గండం

Last Updated : May 26, 2021, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.