ETV Bharat / bharat

రూ.25లక్షల బిల్లు​ ఎగ్గొట్టి హోటల్​ కిటికీ నుంచి జంప్​! - ముంబయి చీటింగ్​ న్యూస్​

విలాసవంతమైన హోటల్​లో దాదాపు ఆరు నెలలు బసచేసి రూ.25 లక్షల బిల్​ను ఎగ్గొట్టేశాడో వ్యక్తి. హోటల్​ యాజమాన్యం కళ్లుగప్పి హోటల్ గది కిటికీ నుంచి పరారయ్యాడు. ఈ ఘటన నవీ ముంబయిలో జరిగింది. అయితే.. ఈ నాటకీయ పరిణామాలు సినిమాను తలపిస్తున్నాయి.

Customer escapes from hotel
హోటల్​లో బిల్​ కట్టకుండా పారిపోయిన వ్యక్తి
author img

By

Published : Sep 4, 2021, 11:43 AM IST

ఓ విలాసవంతమైన హోటల్​లో నెలల తరబడి నివసించి.. రూ.25లక్షలు చెల్లించకుండా తప్పించుకున్నాడో వ్యక్తి. ఈ ఘటన నవీ ముంబయిలో జరిగింది. ఖారఘర్ ప్రాంతంలో ఉండే ఓ మూడు నక్షత్రాల హోటల్​లోకి నవంబర్​ 2020 నవంబర్​ 24న బస చేయడానికి దిగాడు మురళీ మురుగేశ్​ కామత్​. ఆయన వెంట 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. తనిశ్​ కామత్​ అనే బాలున్ని తన కుమారునిగా పరిచయం చేశాడు. సినిమా ఇండస్ట్రీలో వీఎఫ్​ఎక్స్​ యానిమేటర్​లా పనిచేస్తానని చెప్పాడు. తనకో రెండు రూములు కావాలని కోరాడు.

ఇదిగో.. అదిగో అంటూనే..

డబ్బులు నెల తర్వాత ఇస్తానని చెప్పి హోటల్ యజమాని సంతోష్ శెట్టితో మీటింగ్​ జరిపిన తర్వాత రెండు డీలక్స్ రూములను బుక్​ చేసుకున్నాడు మురుగేశ్ కామత్​. అందుకు బదులుగా తన పాస్​పోర్ట్​ను కూడా హోటల్ యాజమాన్యం దగ్గర పెట్టాడు. ఓ రూములో నివాసం, మరో రూమ్​లో ఇతరులతో తరచు సమావేశాలు ఏర్పాటు చేసేవాడు. మీటింగ్​ల కోసం ఇతర వ్యక్తులు వచ్చి వెళ్తుండేవారు. మురుగేశ్ కామత్ వ్యవహారం చూసి, హోటల్ యాజమాన్యం కూడా నమ్మేసింది. నెల తర్వాత డబ్బులు అడగ్గా.. వివిధ కారణాలు చెబుతూ దాటవేయడం ఆరంభించాడు. ఓ రోజు గట్టిగా అడగ్గా.. పేరు లేని రెండు బ్లాంక్ చెక్​లను ఇచ్చాడు​. బ్యాంక్​లో హోటల్ సిబ్బంది ఆ చెక్​లను డిపాజిట్​ చేయగా.. డబ్బులు లేవు. దీంతో మురుగేశ్​ను నిలదీసినా.. ఇదిగో.. అదిగో.. అంటూ.. జులై వరకు గడుపుతూ వచ్చాడు.

రూ.25 లక్షల బిల్​..

జులై 17న మురుగేశ్ గదికి వెళ్లి.. డోర్​ నాక్​ చేసిన హోటల్ సిబ్బందికి అసలు విషయం బోధపడింది. దాదాపు అరగంటసేపు బెల్​ మోగించినా.. డోర్​ ఓపెన్​ చేయకపోగా.. వేరే తాళంతో తలుపు తెరిచారు. తీరా చూస్తే.. కిటికీ నుంచి మురుగేశ్​ ఉడాయించాడని తెలిసింది. దీంతో ఖారఘర్ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది హోటల్ యాజమాన్యం. రూ. 25లక్షలు బిల్​ చెల్లించకుండా పారిపోయాడని పోలీసులకు తెలిపింది.

ఇదీ చదవండి:ఫోన్​లో గేమ్ ఆడొద్దన్న తండ్రిని గొంతుకోసి చంపిన మైనర్​

తాలిబన్లకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతు- భాజపా మండిపాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.