దేశంలో అంతకంతకూ విస్తరిస్తన్న క్రిప్టో కరెన్సీపై(cryptocurrency news) పారిశ్రామిక వర్గం ప్రతినిధులు, నిపుణులతో ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం కీలక సమావేశం నిర్వహించింది. భాజపా నేత జయంత్ సిన్హా దీనికి నేతృత్వం వహించారు(cryptocurrency meeting). భారత ఆర్థికవ్యవస్థకు క్రిప్టోకరెన్సీ అనుకూలతలు, ప్రతికూలతలపై చర్చించారు.
క్రిప్టోకరెన్సీని నియంత్రించడం సాధ్యం కాదని, అందుకే దానికి చట్టబద్ధత కల్పించాలని పులువురు నిపుణులు భేటీలో సూచించినట్లు తెలుస్తోంది(cryptocurrency news in india). ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. మరికొందరు మాత్రం క్రిప్టోకరెన్సీని నిషేధించాలని(cryptocurrency ban), ఇది దేశ ఆర్థికవ్యవస్థకు మంచిదికాదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో క్రిప్టో ఎక్స్చేంజేస్ ప్రతినిధులు, బ్లాక్ చౌన్ అండ్ క్రిప్టో అసెట్స్ కౌన్సిల్, పారిశ్రామిక వర్గ ప్రతినిధులు, మదపరులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు.
మదుపర్ల పెట్టుబడికి భద్రత కల్పించడం అత్యంత తీవ్రమైన విషయమని సమావేశంలో పాల్గొన్న ఎంపీలు అభిప్రాయడపడినట్లు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ ప్రకటనలు జాతీయ వార్తా పత్రికల్లో మొదటి పేజీలోనే బ్యానర్‌లా రావడంపై వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. కొద్దిరోజులుగా దేశంలో క్రిప్టోకరెన్సీ చర్చనీయాంశమైంది. పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ విషయంపై భేటీ నిర్వహించడం ఇదే తొలిసారి.
పోంజీలా కావొద్దు..
క్రిప్టో కరెన్సీలు(cryptocurrency news latest) పోంజీ తరహా పథకాలుగా మారరాదని కొంత మంది సభ్యులు అభిప్రాయపడ్డారు. అధిక ప్రతిఫలం లభిస్తుందనే హామీతో మోసపూరిత పథకాల్లో పెట్టుబడులు పెట్టమంటూ ప్రజలను మభ్యపెట్టేవే పోంజీ పథకాలు. ప్రసార సాధనాలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఒక ఎంపీ పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ను నియంత్రించడం కష్టమైనపుడు క్రిప్టోకరెన్సీలను ఎలా నియంత్రించగలుగుతారని మరో సభ్యుడు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు క్రిప్టో కరెన్సీని వాడే అవకాశమూ ఉందని కొంత మంది ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టో కరెన్సీ పరిశ్రమను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), సెబీ, మరేదైనా సంస్థ.. నియంత్రిస్తుందా అనే విషయంలోనూ స్పష్టత రాలేదు. క్రిప్టో కరెన్సీ విలువలను కొనుగోలుదారు లేక వినియోగదారు ఎక్స్ఛేంజీలో మాత్రమే తెలుసుకునే వీలుంటుంది. ఈ పరిశ్రమపై ఎలాంటి నిబంధనావళి రూపొందించాలనే విషయమై ఎంపీల అభిప్రాయం తెలుసుకున్నట్లు జయంత్ సిన్హా వెల్లడించారు.
ఇదీ జరిగింది..
క్రిప్టోకరెన్సీల(cryptocurrency in india) లావాదేవీలకు తమ నియంత్రణ పరిధిలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సహకారం అందించకుండా నిషేధం విధిస్తూ ఆర్‌బీఐ 2018 ఏప్రిల్6న జారీ చేసిన సర్క్యులర్‌ను 2020 మార్చిలో సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో 2021 ఫిబ్రవరి 5న అధీకృత డిజిటల్ కరెన్సీకి ఒక నమూనాను సూచించడం కోసం ఆర్‌బీఐ ఒక అంతర్గత సంఘాన్ని నియమించింది. అధికారిక డిజిటల్ కరెన్సీ ఆవిష్కరిస్తామని తదుపరి ఆర్‌బీఐ ప్రకటించింది.
శీతాకాల సమావేశంలో బిల్లు
క్రిప్టోకరెన్సీలపై ప్రభుత్వం నవంబరు 29 నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. క్రిప్టో కరెన్సీల విషయంలో మదుపర్ల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా చూడడంపై ఈ బిల్లు దృష్టి సారించొచ్చు. కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుకు ఆమోదముద్ర వేస్తే సమావేశాల తొలివారంలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టే వీలుంది.
నియంత్రణ పరిధిలోకి డిజిటల్ పసిడి!
క్రిప్టో ఆస్తులతో పాటు డిజిటల్ పసిడిని కూడా నియంత్రణ పరిధిలోకి తీసుకువచ్చే దిశగా ఆర్థిక శాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)లు పనిచేస్తున్నాయి. మదుపర్ల ప్రయోజనాల నిమిత్తం నియంత్రిత సెక్యూరిటీలకు అమలు చేస్తున్న నిబంధనలనే వీటికీ వర్తింపజేయాలని భావిస్తున్నట్లు సాచారం. డిజిటల్ పసిడి, ఇతరత్రా పెట్టుబడుల ఉత్పత్తులను ఆఫర్‌చేయడంపై నమోదిత బ్రోకర్లు, ఇన్వెస్ట్‌మెంట్ సలహాదార్లపై అక్టోబరులో సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. రాబోయే బడ్జెట్‌లో డిజిటల్ పసిడిని సెక్యూరిటీలుగా వర్గీకరించే విషయంపై ప్రభుత్వంతో సెబీ చర్చలు జరుపుతోంది.
ఇదీ చదవండి: క్రిప్టోకరెన్సీతో ఉగ్రవాదులకు నిధులు చేరే ముప్పు..త్వరలో కేంద్రం చర్యలు!