శాసనసభ ఎన్నికల వేళ బంగాల్లో భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించగా.. నరేంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని కాతిపొరా గ్రామంలో 48 నాటుబాంబులు, నాటు తుపాకులు బయటపడ్డాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అంతకుముందు.. శనివారం అర్ధరాత్రి సమయంలో కుల్తాలీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మెరిగుంజ్లో ఓ ఆయుధ కర్మాగారాన్ని ధ్వంసం చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నాలుగు తుపాకులు సహా.. తయారీలో ఉన్న ఓ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఈ ప్రాంతాల్లో ఏప్రిల్ 6న మూడో దశ ఎన్నికలు జరగనున్న వేళ.. ఇలా నాటు బాంబులు బయటపడటం కలకలం రేపుతోంది.
ఇదీ చదవండి: 365 కిటికీలతో ప్రసిద్ధి గాంచిన 'హవాహమల్'