ETV Bharat / bharat

యూపీలో 'సరిలేరు నీకెవ్వరు' సీన్​.. జవాన్లే పెళ్లి పెద్దలు

CRPF soldiers in marriage: ఉత్తర్​ప్రదేశ్​లోని రాయ్​బరేలీలో సరిలేరు నీకెవ్వరు సీన్​ కనిపించింది. ఓ అమర జవాను సోదరి పెళ్లికి సహచర సైనికులు హాజరై వివాహ తంతును పూర్తి చేశారు. పెళ్లి పెద్దలుగా మారి అన్న లేని లోటును తీర్చారు. యూనిఫామ్​లో సైనికులు పెళ్లి పనులు చేస్తుంటే.. బంధువుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

CRPF soldiers in marriage
పెళ్లిలో సీఆర్​పీఎఫ్​ జవాన్లు
author img

By

Published : Dec 15, 2021, 5:44 PM IST

CRPF soldiers in marriage: అమర జవాను సోదరి వివాహానికి సహచర సైనికులే పెళ్లి పెద్దలయ్యారు. పెళ్లి పనులు చేసి ఆమెకు అన్నలేని లోటును తీర్చారు. సీఆర్​పీఎఫ్​ 110వ బెటాలియన్​కు చెందిన కానిస్టేబుల్​ శైలేంద్ర ప్రతాప్​ సింగ్​.. గతేడాది అక్టోబర్​ 5న జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరుడయ్యారు. కుంటుంబానికి ఆయన లేని లోటు తీర్చలేనిది. అయితే.. సహచర సైనికులు అన్నీ తామై శైలేంద్ర చెల్లెలి పెళ్లి తంతును పూర్తి చేశారు.

CRPF soldiers in marriage
పెళ్లి వేడుకలో సీఆర్​పీఎఫ్​ జవాన్లు

ఉత్తర్​ప్రదేశ్​ రాయ్​బరేలిలో రెండు రోజుల క్రితం జరిగిన శైలేంద్ర ప్రతాప్​ సింగ్​ చెల్లెలు జ్యోతి పెళ్లికి పదుల సంఖ్యలో సైనికులు హాజరయ్యారు. వచ్చామా, పెళ్లి చూసుకుని వెళ్లామా అన్నట్టు కాకుండా పెళ్లి కూతురికి అన్నలేని లోటును తీరుస్తూ వివాహ తంతు మొత్తం సవ్యంగా జరిగేలా చూశారు. అన్న మాదిరిగా ఆశీర్వదించి కానుకలు అందజేశారు.

CRPF soldiers in marriage
పెళ్లి కూతురితో సీఆర్​పీఎఫ్​ జవాన్లు

యూనిఫామ్​లో జవాన్లు పెళ్లి మండపానికి చేరుకున్న క్రమంలో అక్కడ ఉన్నవారు భావోద్వేగానికి గురయ్యారు. అన్న చేయాల్సిన పనులు సైనికులు చేస్తుంటే చూస్తున్న అక్కడి వారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

CRPF soldiers in marriage
పెళ్లి కూతురుని తీసుకొస్తున్న సీఆర్​పీఎఫ్​ జవాన్లు

ఈ పెళ్లి వేడుక ఫొటోలను ఆ మరుసటి రోజున సీఆర్​పీఎఫ్​ ట్విట్​ చేసింది. దివంగత సైనికుడు ప్రతాప్​ సింగ్​ సోదరి జ్యోతి వివాహ వేడుకకు అన్నయ్యలుగా సైనికులు హాజరయ్యారని పేర్కొంది. దీనికి మరణించినా.. మర్చిపోలేదు అని హ్యాష్​ట్యాగ్​ ఇచ్చింది.

CRPF soldiers in marriage
శైలేంద్ర ప్రతాప్​ సింగ్​ కుటుంబంతో జవాన్లు

" శైలేంద్ర ప్రతాప్​ సింగ్​ చెల్లెలి పెళ్లికి అన్నయ్యలుగా సీఆర్​పీఎఫ్​ సైనికులు హాజరయ్యారు. 2020, అక్టోబర్​ 5న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో సీఆర్​పీఎఫ్​ 110 బెటాలియన్​కు చెందిన శైలేంద్ర ప్రతాప్​ సింగ్​ అమరుడయ్యారు."

- సీఆర్​పీఎఫ్​.

సీఆర్​పీఎఫ్​ ట్వీట్​ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. చాలా మంది సీఆర్​పీఎఫ్​ బలగాలపై ప్రశంసలు కురిపించారు. తన కుమారుడు జీవించి లేనప్పటికీ, సీఆర్​పీఎఫ్​ జవాన్ల రూపంలో ఎంతో మంది కుమారులు ఉన్నారని శైలేంద్ర ప్రతాప్​ సింగ్​ తండ్రి అన్నారు.

ఇదీ చూడండి: సొంత చెల్లినే వివాహమాడిన అన్న.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.