Rahul Gandhi on Agnipath: స్వల్పకాలంలో సైనిక నియామకాల నిమిత్తం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన విమర్శలకు పదునుపెట్టారు. ‘50 సంవత్సరాల పాటు తన స్నేహితులకు విమానాశ్రయాలు కట్టబెట్టి, నరేంద్రమోదీ వారిని దౌలత్‌వీర్(ధనవంతులు)గా మార్చుతున్నారు. మరోపక్క నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చి యువతను అగ్నివీర్‌గా మార్చుతున్నారు’ అంటూ రాహుల్ విమర్శించారు.
ఇదే అంశంపై పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. అగ్నిపథ్ పథకం కింద ఉద్యోగంలోకి తీసుకున్న యువత పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాల ఉద్యోగం తర్వాత వారి భవిష్యత్తు అనిశ్చితిగా మారుతుందన్నారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. ‘భాజపా వలే కాకుండా ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలన్నదే ఆశయం. నాలుగు నెలల శిక్షణ.. నాలుగు సంవత్సరాల ఉద్యోగం.. ఆ తర్వాత వారి భవిష్యత్తు ఏంటి..? అది పూర్తి అనిశ్చితితో ఉంది. అగ్నిపథ్ పథకం కింద తీసుకున్నవారి పదవీవిమరణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాను’ అని మమత వ్యాఖ్యలు చేశారు.
ఇవీ చదవండి: