Cremation of CDS Bipin Rawat: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ అంత్యక్రియలు దిల్లీలో శుక్రవారం జరగనున్నాయి. గురువారం సాయంత్రం వారి భౌతికకాయాలను సైనిక విమానంలో దిల్లీకి తరలించనున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి.
రావత్ దంపతుల భౌతికకాయాలను శుక్రవారం వారి నివాసానికి తరలించి.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత కామరాజ్ మార్గ్ నుంచి దిల్లీ కంటోన్మెంట్లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికకు అంతిమయాత్రగా తీసుకువెళ్లి.. అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రముఖుల నివాళులు
జనరల్ రావత్ సహా ఇతర మృతులకు వెల్లింగ్టన్‌లోని మద్రాసు రెజిమెంటల్ కేంద్రం (ఎంఆర్‌సీ)లో గురువారం ఉదయం పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తారు. తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్, ఐఏఎఫ్ అధిపతి వి.ఆర్.చౌధరి తదితరులు అక్కడి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రావత్ దంపతుల భౌతికకాయాలను కోయంబత్తూరుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి వాయుమార్గంలో దిల్లీకి తరలిస్తారు.
Cds general helicopter crash: తమిళనాడులోని కోయంబత్తూర్-కూనూర్ మధ్యలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగానూ 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.
ఇవీ చూడండి: