కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కోవిన్ పోర్టల్.. వచ్చేవారం నుంచి హిందీ సహా.. 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది. అయితే.. కొవిడ్-19 వేరియంట్లను పర్యవేక్షించేందుకు గానూ.. మరో 17 ప్రయోగశాలలను ఇన్సాకాగ్(ద ఇండియన్ సార్స్-కోవ్-2-జెనొమిక్ కాన్సోర్టియా) నెట్వర్క్లో చేర్చనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది.
ఈ మేరకు కొవిడ్-19పై ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి మంత్రుల బృందం 26వ సమావేశంలో ఈ నిర్ణయాలు వెలువరించినట్టు ప్రకటించింది.
టీకా వేసుకున్నవారి పేరు, ఫోన్ నంబరు వంటి పూర్తి వివరాలను జిల్లాల వారీగా తెలుసుకునేందుకు రూపొందించిన ఈ పోర్టల్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 ప్రయోగశాలల ద్వారా సేవలందిస్తోంది.
ఇదీ చదవండి: 'ఇప్పటికే కొరత- కొవిడ్ ఔషధాల నిల్వ తగదు'