ETV Bharat / bharat

గోమూత్రం, పేడతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: సీఎం - మధ్యప్రదేశ్ సీఎం

ఆవులు, వాటి మూత్రం, పేడతో వ్యక్తిగతంగా ఆర్థిక వృద్ధి సాధించటమే కాకుండా.. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​. 'శక్తి 2021' కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

shivraj singh chouhan
శివరాజ్ సింగ్ చౌహాన్
author img

By

Published : Nov 14, 2021, 6:31 AM IST

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆవులు, వాటి మూత్రం, పేడతో వ్యక్తిగత ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని, దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు.

ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్​ నిర్వహించిన మహిళా పశువైద్యుల సమ్మేళన సదస్సులో(శక్తి 2021) భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు మధ్యప్రదేశ్ సీఎం. ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో గోశాలలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. అయితే.. సమాజ భాగస్వామ్యంతోనే పశుసంరక్షణ సాధ్యమవుతుందని అన్నారు.

"గోవులు, గోపేడ, గోమూత్రంతో వ్యక్తిగత ఆర్థిక సామర్థ్యాన్ని పటిష్ఠం చేసుకోవటం ద్వారా.. దేశ ఆర్థిక స్థితిని మరింత బలపరచొచ్చు. కలప వాడకాన్ని తగ్గించేందుకు మధ్యప్రదేశ్​ శ్మశానవాటికల్లో గౌకాస్త్(ఆవు పేడతో చేసిన పిడకలు) ఉపయోగిస్తున్నారు."

--శివ​రాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి.

గోవుల పెంపకం ద్వారా మధ్యతరగతి రైతులకు, వ్యాపారులకు లాభం చేకూరే వివిధ మార్గాలను పశువైద్యులు అన్వేషించాలని శివ​రాజ్ సూచించారు.

గుజరాత్​ గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మహిళలు గోవుల పెంపకంపై ఆధారపడుతున్నారని, డెయిరీ వ్యాపారంలో వారు సఫలీకృతులయ్యారని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తమ్ రూపాలా అన్నారు. ఉమెన్ వెటర్నరీ గ్రాడ్యుయేట్లకు సాయం అందించే దిశగా కేంద్రం అడుగులేయాలని కోరారు.

ఇదీ చదవండి:

రూ. 90కోట్ల హెరాయిన్ పట్టివేత.. ఆ మహిళలే సూత్రధారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.