కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో భారత్ మరో మైలురాయిని దాటింది. ఈ నెల 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం 11వ రోజూ (మంగళవారం) విజయవంతంగా కొనసాగింది. మంగళవారం రాత్రి 7గంటల వరకు దేశవ్యాప్తంగా 20.29లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు పరిమితంగానే టీకా పంపిణీ చేసిన అధికారులు.. ఐదు రాష్ట్రాల్లో 5615 మందికి మాత్రమే టీకా వేశారు. వీరిలో ఏపీలో 9 మంది, కర్ణాటకలో 429, రాజస్థాన్ 216, తమిళనాడు 4926, తెలంగాణ 35 మంది చొప్పున ఉన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 20,29,424మంది టీకా వేయించుకున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఏపీలో ఇప్పటివరకు 1,56,129మంది, తెలంగాణలో 1,30425మంది చొప్పున టీకా అందుకున్నారు.
రాష్ట్రాల వారీగా టీకా పంపిణీ వివరాలు ఇలా..