ETV Bharat / bharat

'ప్రపంచీకరణతో పాటు స్వయం సమృద్ధీ ముఖ్యమే'

author img

By

Published : Nov 7, 2020, 12:03 PM IST

Updated : Nov 7, 2020, 12:39 PM IST

కొవిడ్ అనంతర ప్రపంచంలో అనేక మార్పులు వస్తాయని, సాంకేతికత కీలకంగా వ్యవహరిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచీకరణ ఎంత ముఖ్యమో, స్వయం సమృద్ధి సాధించడమూ అంతే ముఖ్యమని ఉద్ఘాటించారు. సులభతర వ్యాపారానికి దేశం అందిస్తున్న అవకాశాల ద్వారా ప్రజల జీవనవిధానాన్ని మెరుగుపరచాలని యువతకు పిలుపునిచ్చారు.

modi
మోదీ

సులభతర వ్యాపారం కోసం దేశం అందించే అవకాశాలతో ప్రజల జీవనాన్ని మెరుగుపరచాలని యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన... కరోనా తర్వాత ప్రపంచంలో సమూల మార్పులు సంభవిస్తాయని అన్నారు. సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రపంచీకరణ ఎంత ముఖ్యమో స్వయం సమృద్ధి సాధించడం అంతే ముఖ్యమని కరోనా ప్రపంచానికి చాటిచెప్పిందని పేర్కొన్నారు.

ఆవిష్కరణల నాణ్యతపై దృష్టిపెట్టాలని యువతకు మోదీ సూచించారు. ఈ విషయంలో రాజీ పడొద్దని అన్నారు. 'బ్రాండ్ ఇండియా'కు యువతే అసలైన ప్రచారకర్తలని పేర్కొన్నారు.

"సులభతర వాణిజ్యం కోసం యువతకు అవకాశాలు కల్పించేందుకు భారత్ కట్టుబడి ఉంది. దీన్ని ఉపయోగించుకొని తమ ఆవిష్కరణల ద్వారా యువత.. దేశంలోని కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు. మీ నైపుణ్యం, అనుభవం, ప్రతిభ, ఆవిష్కరణలతో ప్రతీపేద పౌరుడూ సులభంగా జీవించేలా కృషి చేయండి. కొవిడ్ మనకు చాలా నేర్పించింది. ప్రపంచీకరణ ముఖ్యమే, అదే సమయంలో స్వయం సమృద్ధి సాధించడం కూడా అంతే ముఖ్యం. కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించే విధంగా యువతకు అవకాశాలు కల్పించడమే ఆత్మనిర్భర్ భారత్ ఉద్దేశం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

సీవీ రామన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు మోదీ. రామన్ కృషి స్ఫూర్తిదాయకమని కీర్తించారు. యువ శాస్త్రవేత్తలకు ఎంతో కాలంగా ఆయన ప్రేరణగా నిలుస్తున్నారని అన్నారు.

దేశ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తమ ప్రభుత్వం ఒకదాని తర్వాత మరొక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు మోదీ. గత శతాబ్దపు నిబంధనలతో వచ్చే శతాబ్దపు భవిష్యత్తును నిర్ణయించలేమని పేర్కొన్నారు. సాంకేతికతతో సుపరిపాలన ఎలా అందించవచ్చో గత ఐదేళ్లలో దేశ ప్రజలు గమనించారని చెప్పారు. పేదవారితో మమేకం కావడం, ప్రతీ ఒక్కరికీ సేవలను అందించడం సాంకేతికత వల్ల సాధ్యమైందని అన్నారు. అవినీతి పరిధి సైతం తగ్గిందని స్పష్టం చేశారు.

Last Updated : Nov 7, 2020, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.